Covaxine Bharath Biotech: “కొవాక్జిన్” తో కోట్లు కావాలా..!? కరోనా తగ్గాల..!? భారత్ బయోటెక్ లక్ష్యం ఏమిటి..!?

Covaxine Bharath Biotech: vaccine issues in india
Share

Covaxine Bharath Biotech: మహమ్మారి మానవాళిని మింగేస్తుంది.. మరుభూమి నిండేలా ప్రాణాలు తోడేస్తుంది.. మానవ మేథో సంపత్తికి సవాలు విసురుతుంది.. దీన్ని స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.. టీకాల శోధన, తయారీ, పంపిణీ చకచకా జరుగుతుంది.. కానీ ఈ దశలో భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన “కొవాక్జిన్” వాక్సిన్ పై కొన్ని విమర్శలు వస్తున్నాయి.. ఆ యాజమాన్యం తీరుపై కొన్ని అభ్యంతరాలు, ఆ స్వార్ధతనంపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి.. టీకా ఫార్ములా ఎవ్వరికీ ఇవ్వము. ఇది మా ఫార్ములా.. ICMR కి సంబంధం లేదు అని సాక్షాత్తూ ఆ కంపెనీ కీలక ప్రతినిధి సుచిత్ర ఎల్లా చెప్పడం దేశం మొత్తం విస్మయ పరుస్తుంది.. నిజానికి ఈ టీకా సాంకేతికత, ఫార్ములాలో మొదటి నుజ్నది ICMR పాత్ర ఉందని ఆ కంపెనీ ఎండీ రాచెస్ ఎల్లా, చైర్మన్ కృష్ణ ఎల్లా గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు దేశానికి అవసరమైన సమయంలో ఇవ్వము, మా ఫార్ములా అంటూ కొన్ని పెట్టుడు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు..!

Covaxine Bharath Biotech: vaccine issues in india
Covaxine Bharath Biotech: vaccine issues in india

Covaxine Bharath Biotech:  కీలక పాయింట్ ఓ సారి గమనించాలి..!

పశ్చిమ గోదావరి జిల్లా భీమ‌వ‌రంకు చెందిన ఎల్లాప్ర‌గ‌డ సుబ్బారావు (జ‌న‌వ‌రి 12,1895 – ఆగ‌స్టు 9, 1948) అనే వ్యక్తి… అప్పట్లో అమెరికా వెళ్లి ప‌లు రోగాలకు మందులు కనుగొన్నారు. క్యాన్స‌ర్‌, క్ష‌య‌, బోధ‌కాలు, పాండురోగం, టైఫాయిడ్ వంటి భయానక వ్యాధులకు మందులు కనిపెట్టి… ఫార్ములా అందరికీ చెప్పారు. “ఇది నా ఫార్ములా.. నేను కనిపెట్టాను అని ఆయ‌న ఎక్క‌డా అన‌లేదు. అంద‌రికీ ఇచ్చి ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడారు.. అందుకే ఆ పేరు దశాబ్దాల తర్వాత కూడా మార్మోగుతుంది.
* నెల్లూరు కృష్ణ‌ప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య‌, వ‌న‌మూలిక‌ల‌తో త‌యారు చేసిన కరోనా మందు ఉచితంగా అంద‌రికీ పంచుతున్నాడు. ఇప్పటికే ఆటంకాలు రాకపోతే ఆయన వేలాది మందికి ఇచ్చేసేవాడు. ఎన్నో ప్రాణాలు నిలబెట్టే వాడు.
* కొవాక్జిన్ “భారత్ బయోటెక్” వాళ్లదే కావచ్చు. కానీ ICMR సహకారం లేకుండా మాత్రం అది పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. ICMR (ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌) స‌హాయంతోనే భార‌త్ బ‌యోటెక్ (దీని చైర్మన్ కృష్ణ ఎల్లా – ఈనాడు ఎండీ కిరణ్ వియ్యంకుడు. ఈనాడు వాళ్లకి కూడా దీనిలో షేర్ ఉన్నట్టు పుకార్లు ఉన్నాయి.) త‌యారు చేసిన కొవాక్జిన్ ఫార్ములాను ఎవ‌రికీ ఇవ్వం అని ఆ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్లా ప్ర‌క‌టించారు. నిజానికి ఈ వాక్సిన్ ని ప్రపంచం గుర్తించలేదు. ఇది వేసుకుని విదేశాలకు వెళ్లినా వాక్సిన్ వేసుకోనట్టే లెక్క. కోవిషీల్డ్ కి ప్రపంచ గుర్తింపు వచ్చింది..!

Covaxine Bharath Biotech: vaccine issues in india
Covaxine Bharath Biotech: vaccine issues in india

కోట్లు కావాలా..!? కరోనా తగ్గాలా..!?

భారత్ బయోటెక్ కేవలం వ్యాపారం, కోసమే.. కోట్లు గడించడం కోసమే ఈ కొవాక్జిన్ ని తయారు చేసిందా..!? అదే నిజమైతే వారిలో మానవత్వం ఎక్కడున్నట్టు. “మేము వ్యాపారం పెంచుకోడానికి ఈ వాక్సిన్ కనిపెట్టాము. ఎక్కువ ధర వస్తే ఇచ్చేస్తాము” అని చెప్పుకోవచ్చుగా.. కానీ కరోనా పేరిట వ్యాపారం చేసుకోవడం ఎందుకు..!? లేదు జనం కోసం.. దేశం కోసం కనిపెడితే ఫార్ములా ఇచ్చేస్తే పోయేదేముంది..!? ఫార్ములా ఇచ్చేసి ఆ రాయల్టీ తీసుకుంటే లాభం కూడా మిగులుతుందిగా..! మాన‌వాళి మ‌హ‌మ్మారిని ఎదుర్కొంటున్న‌ ప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా “కొంత లాభం తీసుకుని అంద‌రికీ ఫార్ములా ఇవ్వాల్సింది పోయి చిన్న పిల్లలలా స్వార్ధ ఆలోచనలు చేస్తే ఏంటీ ఉపయోగా..!? ఏమో ఈ వాక్సిన్ తో భారత్ బయోటెక్ వేల కోట్లకు అధిపతి అయిపొతుందెమో..! పైన ఉన్న ఈ యువ “వ్యాపార వేత్త ” రాచెస్ ఇంటర్వ్యూ చూస్తే వ్యాపార ధోరణి..? సేవ..? అనే లక్ష్యాల్లో ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది..

 


Share

Related posts

Narendra Modi: మోడీ క‌ల‌గ‌న్న‌ది ఒక‌టి… క‌రోనా వ్యాక్సిన్ల అస‌లు క‌థ ఇంకొక‌టి…

sridhar

Eatala Rajender: బ్రేకింగ్ ..ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

somaraju sharma

డివైడర్‌లకూ వైసిపి జండా రంగు

somaraju sharma