Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ని కలవబోతున్న చంద్రబాబు నాయుడు..?? ఒక్క సారిగా మారిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు..!

Share

Junior NTR రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర  గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీ ఆవిర్భావం నుండి అనేక ఆటు పోట్లను ఎదుర్కొన్నప్పటికీ 2019 ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితిదారుణంగా తయారు అయ్యింది. టీడీపీలోని పెద్ద పెద్ద నాయకులపైనే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతుండటం, నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిపోవడంతో టీడీపీలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. దీంతో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ తన హవా కొనసాగించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం వైసీపీ ఘన విజయం సాధించింది. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ టీడీపీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే తెలంగాణలో మాదిరిగా పార్టీ పరిస్థితి అవుతుందన్న భావన ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని చంద్రబాబు భావిస్తున్నా ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి గెలుపు అవకాశాలు ఉండవని అర్ధం అయ్యింది. అందుకే వైసీపీని ఓడించాలంటే ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లాల్సిన అవస్యకతను గుర్తించారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో పొత్తులకు ఇప్పటి నుండే సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు. కుప్పం పర్యటనలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలన్న ఓ కార్యకర్త సూచనపై చంద్రబాబు స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.

మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేక ఫోకస్ తో

మరో పక్క పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలన్న ప్రతిపాదన ఆ పార్టీ నేతల్లో ఎప్పటి నుండో వ్యక్తం అవుతోంది.  జూనియర్ అభిమానులు పార్టీ పట్ల అంటీ మున్నట్లుగా ఉంటున్నారని వార్తలు వినబడుతున్నాయి. కుప్పంలోనూ జూనియర్ ఫ్యాన్ సొంత రాజకీయాలు మొదలు పెట్టారని ప్రచారం జరుగుతోంది. కుప్పంలో పార్టీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇంతకు ముందు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కుప్పంకు వెళ్లకుండానే రాజకీయాలు చేస్తూ గెలుస్తూ వచ్చిన చంద్రబాబుకుn ఇప్పుడు కుప్పంకు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్ధి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో కుప్పంలో మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తీవ్ర పరాభవం ఎదురైంది.

Junior NTR : జూనియర్ కోసం ప్రయత్నాలు..?

ఈ పరిస్థితుల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం కోసం చంద్రబాబు   నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుండి క్షేత్ర స్థాయి పరిస్థితులను తెప్పించుకుని మరీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని క్యాడర్ కు సూచిస్తున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా జనసేన మద్దతు తీసుకునే ప్రయత్నాలు చేస్తూనే మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారంలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని సమాచారం. గతంలోనూ టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2019 ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ ను రంగంలోకి దించేందుకు నందమూరి ఫ్యామిలీ ద్వారా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..?.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

41 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago