NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Maganti Babu Sons: ఓ మాజీ ఎంపీ/ మాజీ మంత్రి – ఇద్దరు కొడుకులు..! మరణాల వెనుక మిస్టరీ ఇదే..!?

Maganti babu Sons: Death Mystery Story

Maganti Babu Sons: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి.. ఈ పేరు మొన్న చనిపోయిన మాగంటి బాబు కుమారుడిది కాదు.. మాగంటి బాబు తండ్రిది.. ఆ పేరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చరిత్ర. రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్రాండ్. కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజికవర్గానికి ఐకాన్.. కానీ ఆ పేరు ఇప్పుడు మసకబారింది. రాజకీయం తెరమరుగయ్యింది. చివరికి ఒక రాజకీయ కుటుంబ కథ విషాదం వైపు మలుపులు తిరిగింది..! తండ్రి లోపమో.. కుటుంబ అంతర్గత వ్యవహారాలో.. దురలవాట్లో.. కారణాలు ఏమైనా ఈ ఇద్దరి మరణం మాత్రం తీరని విషాదమే..!

ఏలూరు మాజీ ఎంపీ.., మాజీ మంత్రి మాగంటి బాబు ఇద్దరు కుమారులు అనుమానాస్పదంగానే మరణించారు. పెద్ద కుమారుడు మాగంటి రామ్ చంద్రన్ (రాంజీ) ఈ ఏడాది మార్చి ఏడో తేదీన మరణించారు. ఆ మరణం మిస్టరీ వీడలేదు. ఆత్మహత్య అనీ, గుండె పోటు అనీ, కుటుంబ గొడవలు అనీ.., మానసిక సమస్యలు అనీ రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. ఆయన 37 ఏళ్ళు వయసులోనే కన్నుమూశారు. ఆ విషాదం నుండి ఆ కుటుంబం కోలుకోక ముందే రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి (రవీంద్ర) కూడా మొన్న మరణించారు. ఈయన కూడా 35 ఏళ్ళ యవ్వన ప్రాయంలోనే కన్నుమూశారు. ఈయన మృతి అనుమానాస్పదమే.., మరణం చుట్టూ అనేక సందేహాలు మిగిలాయి. జిల్లాలోనూ.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఈ మరణాలపై కొన్ని ప్రశ్నలు మిగిలాయి. కానీ విషాదం, విచారం ముందు అనుమానాలు, ప్రశ్నలు చిన్నబోతున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ ఇద్దరు యువకుల మరణమే హాట్ టాపిక్..!

Must Read it: Eenadu Ramojirao VS Daggubati in NTR Death Episode Secrets 

Maganti babu Sons: Death Mystery Story
Maganti babu Sons Death Mystery Story

Maganti Babu Sons: మిస్టరి.. కానీ దురలవాట్లు..!

మరణాలు మిస్టరీ అనుకోలేము. రెండూ స్పష్టమైన స్వీయ కారక మరణాలే. నిజమైన కారణాలు ఇవే అనీ ఇప్పుడు ఏ ఒక్కరూ నిర్ధారించలేరు. కానీ ఆ వర్గాల్లో ఉన్న చర్చ మాత్రం ఓ సారి చెప్పుకుంటే… పెద్ద కుమారుడు రాంజీ మొదటి నుండి వివాదాల్లో ఉన్నారు. కుటుంబ తగాదాలున్నాయి. భార్యతో కూడా సఖ్యత లేదు. 2016 లో ఓ సారి ఆయనపై ఓ యువతీ కేసు పెట్టారు. అధికారం.. రాజకీయ బలం.. డబ్బు.. వెరసి యవ్వనమే దారి తప్పింది. ఆయన పొలిటికల్ కెరీర్ ని బాలన్స్ చేసుకోవడంలో విఫలమయ్యారు. క్రికెట్ బెట్టింగ్, జూదం, కొన్ని వివాదాల్లో తలదూర్చి ఆర్ధికంగా నష్టపోయారు. ఆ అప్పులు తీర్చలేక మానసికంగా ఒత్తిడికి గురై.. మరోవైపు రాజకీయంగానూ సరైన అడుగులు పడక.. కుటుంబం, స్నేహితులు అందలేకపోవడంతో ఒంటరిగా ఫీల్ అయ్యి మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? గుండెపోటా..? ఇంకేమైనా కారణమా..? అనేది ఇప్పుడు అనవసరం.. రాంజీ మాగంటి రాజకీయ వారసుడిగా కొన్నేళ్లుగా యాక్టీవ్ గా ఉన్నారు. కానీ ఇలా జరగడంతో రెండో కుమారుణ్ణి తెరపైకి తెచ్చేనందుకు మాగంటి బాబు సన్నాహాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా…

Maganti babu Sons: Death Mystery Story
Maganti babu Sons Death Mystery Story Ramji

* రెండో కుమారుడు రవీంద్రకు కూడా దురలవాట్లున్నాయి. మద్యానికి బానిస. ఇలా ఉంటె రాజకీయ నడవడిక కష్టం. కుటుంబ వారసత్వం మోయలేరు. అందుకే మాగంటి బాబు తన రెండో కుమారుడికి చికిత్స చేయించారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో 20 రోజుల నుండి మద్యం మానడం.., మానసిక ఒత్తిడి తగ్గడం కోసం రకరకాల చికిత్స తీసుకుంటున్నారు. ఇది ఇష్టం లేకనో.. ఒత్తిడి ఎక్కువవ్వడం వల్లనో రవీంద్ర ఆసుపత్రి నుండి వచ్చేసి.. హోటల్ రూమ్ లో మరణించారు.

Read it: ఎన్టీఆర్ ఎందులో గొప్ప..? ప్రత్యేక కథనాలు.. పార్ట్ 1, 2 

ఆ కుటుంబానికి మంచి పేరు..! 

పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి కుటుంబానికి మంచి పేరు ఉంది. 1989 ఎన్నికల్లో రవీంద్రనాథ్ చౌదరి తొలిసారిగా దెందులూరు నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ అంతకుముందే కాంగ్రెస్ లో మంచి లీడర్ గా జిల్లాలో సుపరిచితులు. ఆయన మధ్యలో మరణించడంతో ఆయన భార్య వరలక్ష్మి దేవీ ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం మంత్రిగా కూడా పని చేసారు. వారి వారసుడిగా మాగంటి బాబు 2004లో దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ పని చేశారు. 2008లో మంత్రి పదవి నుండి తొలగించడంతో కాంగ్రెస్ పైనా.., రాజశేఖర్ రెడ్డిపైనా అలిగి టీడీపీలో చేరారు. 2014 లో టీడీపీ నుండి ఏలూరు ఎంపీగా గెలుపొందారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఈ కుటుంబానికి అవినీతి, వివాదం అనే మరకలు లేవు. క్లీన్ పాలిటిక్స్ అనే పేరు ఉంది. అందుకే మాగంటి బ్రాండ్ జిల్లాలో బాగా ఏర్పడింది. చివరికి వారసులు లేకుండా ఇలా విషాద మరణాలు కలచివేశాయి.. ఆ కుటుంబ ముద్రని చెరిపివేశాయి..!

author avatar
Srinivas Manem

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !