NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Narendra Modi: ఓ వైపు తిట్టుకుంటున్నా.., ఆ విషయంలో బైడెన్ ని మించిపోయిన మోడీ..!

narendra modi overtakes biden

Narendra Modi: నరేంద్ర మోదీ Narendra Modi ఈపేరు భారతదేశంలో ఓ తారక మంత్రం. ప్రపంచ  దేశాల్లో మోదీ అంటే క్రేజ్. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు మోదీ పేరు దేశంలో మోగిపోయింది. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా మోగిపోయింది. అందుకే రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారో అవి చేశారో లేదో అనేకంటే.. ఈ ఏడేళ్లలో మాత్రం తన మార్క్ చూపించారు. మోదీ వంటి వ్యక్తి దేశానికి ఉండాలి అనేంతగా ఆయన హవా సాగింది. అందుకే ఆయన ప్రజాదరణలో ముందున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గత ఏడేళ్లలో లేని రిమార్కును కూడా దక్కించుకున్నారు. అయినా.. ఆయనపై వ్యతిరేకత ఆయన క్రేజ్ పై ప్రభావం చూపలేదు. ప్రపంచ నేతల కంటే పైనే ఉన్నారు. ఇందుకు ఓ సర్వేనే ఉదాహరణ.

narendra modi overtakes biden
narendra modi overtakes biden

అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ‘ది మోర్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో మోదీకి వచ్చిన ఓట్లే ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. సర్వేలో అత్యధిక ఓట్లు లభించడంతో టాప్ లో నిలిచారు. మొత్తం 13 దేశాల నేతలపై అభిప్రాయాలను ఈ సర్వేలో సేకరించారు. సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ సర్వేలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్.. సహా  13 దేశాల నేతలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా దేశాధినేతల నేషనల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేయగా మోదీకి 66శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చింది. 2019 ఆగష్టు నాటి సర్వేతో పోలిస్తే 20 పాయింట్లు తగ్గాయి. అయినా.. మిగిలిన నేతల కంటే మోదీనే టాప్ లో నిలివడం విశేషం.

Read More: Pawan Kalyan: పవన్ కు ఇప్పుడు కేసీఆరే మార్గదర్శి..! ఫాలో అవుతారా.. మరి?

2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో మోదీకి 82 శాతం అప్రూవల్ రేటింగ్ రాగా.. 11 శాతం మంది వ్యతిరేకించారు. ప్రస్తుత సర్వేలో జూన్ నాటికి మోదీకి 66 శాతం అప్రూవల్ రేటింగ్ రాగా.. 28 శాతం మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని సంస్థ తెలిపింది. ఇదంతా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యం, వ్యాక్సినేషన్ కారణాలని చెప్పకతప్పదు.  అయినా.. మోదీ క్రేజ్ కి వచ్చిన ఇబ్బంది లేకపోవడం విశేషం. మిగిలిన 12 మంది అగ్ర దేశాధినేతల కంటే మోదీనే అగ్రస్థానంలో నిలిచారు. ఈ సర్వేలో భారత్ నుంచి 2,126 మంది వయోజనులు పాల్గొన్నారు. సర్వేలో మోదీ ప్రథమ స్థానంలో.. ఇటలీ ప్రధాని మరియో డ్రఘి రెండో స్థానంలో నిలిచారు.

author avatar
Muraliak

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju