NewsOrbit
జాతీయం న్యూస్

Fuel Price Rise: 44రోజుల్లో 25 సార్లు పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు!శరవేగంతో వంద మార్కును దాటేసిన వైనం !!

Fuel Price Rise: పెట్రోల్ ,డీజిల్ ధరలు శరవేగంతో పరుగులు తీస్తున్నాయి.అనేక రాష్ట్రాల్లో వీటి ధరలు సెంచరీ మార్కును దాటేశాయి. భారతదేశ చరిత్రలో ఇది ఆల్టైమ్ రికార్డని చమురు రంగ నిపుణులు చెప్తున్నారు.మే నాలుగున ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఇప్పటివరకు పెట్రో ఉత్పత్తుల ధరలు ఇరవై అయిదు సార్లు పెరిగాయి.ఈ నలభై నాలుగు రోజుల్లో పెట్రోల్ ధర లీటర్ కి 6.26 పైసలు,డీజిల్ ధర లీటర్ కి 6.68 పైసల చొప్పున పెరిగాయి.

Prices of petro products increased 25 times in 44 days!
Prices of petro products increased 25 times in 44 days

Fuel Price Rise: ఢిల్లీలో తక్కువ ..రాజస్థాన్ లోఎక్కువ!

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 96.66 రూపాయలుగా ఉంది.అలాగే డీజిల్ ధర 87.41రూపాయలు పలుకుతోంది.హస్తిన లో పెట్రో ఉత్పత్తుల ధరలు సెంచరీ దాటకపోయినా అనేక రాష్ట్రాల్లో లీటర్ ధర వంద రూపాయల కంటే అధికమైపోయింది.రాజస్థాన్లోని గంగానగర్లో గురువారం అత్యధిక పెట్రోల్ ధర నమోదైంది.అక్కడ లీటర్ పెట్రోల్ ధర 107.79 రూపాయలకు చేరుకుంది.లీటర్ డీజిల్ ధర 100.51 రూపాయలు అయింది.దేశం మొత్తం మీద ఇదే అత్యధిక రేటు అని చమురు రంగ నిపుణులు చెప్పారు.

మెట్రో నగరాల్లో ఎలా ఉందంటే?

ఇక దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు ముంబై ,బెంగుళూరులలో ఎక్కువగా ఉన్నాయి. ముంబైలో 102 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర ఉండగా బెంగుళూరులో 99.89 రూపాయలు పలుకుతోంది.మిగిలిన మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్ ధర కాస్త అటు ఇటుగా ఇంతే ఉంది.

బాగా ప్రభావితమైన రాష్ర్టాలు!

పెట్రో ఉత్పత్తులు ధరలు పెరగడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ,మధ్యప్రదేశ్, కర్నాటక తెలంగాణ ,లడక్ రాష్ర్టాలు బాగా ప్రభావితమయ్యాయి.ముంబయి, రత్నగిరి, పర్భానీ, ఔరంగాబాద్ ,జైసల్మీర్, గంగానగర్, బన్స్వారా, ఇండోర్ ,భోపాల్ ,గ్వాలియర్, గుంటూరు కాకినాడ చిక్మగలూరు,శివమొగ్గ హైద్రాబాద్, లే పట్టణాల్లో లీటర్ పెట్రోలు ధర వంద రూపాయలు దాటేసింది.అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం ,ఆయా రాష్ర్టాల్లో ఉన్న అంతర్గత పన్నుల విధానం వల్ల పెట్రోల్ ,డీజిల్ ధరలు ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఆకాశానికి అంటుతున్నట్లు చమురు రంగ నిపుణులు చెబుతున్నారు.ఢిల్లీలో పెట్రోల్ ధర తక్కువగా ఉండటం కొన్ని రాష్ర్టాల్లో ఈ రేటు ఎక్కువగా ఉండటం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.స్థానిక పన్నుల విధానాన్ని సవరిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు వివరిస్తున్నారు.మరి రాష్ర్టాలు ఆ పనిచేస్తాయా అంటే అనుమానాస్పదమే!

 

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju