NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ మోహన్ రెడ్డి ప్రేమలో పడిపోయిన నరేంద్ర మోదీ

Bjp leaders praising ap cm ys jagan

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఓడలు బండ్లు కావచ్చు.. బండ్లు ఓడలు కావచ్చు. రాత్రికి రాత్రే మారే రాజకీయాలు ఇవి. ఎంతమందిని చూసుంటాం.. రోజుకో పార్టీ మార్చే నాయకులను. ఏ నాయకుడికైనా కావాల్సింది అధికారం, డబ్బు, పలుకుబడి. వీటి కోసమే నూటికి తొంబైతొమ్మిది మంది రాజకీయాల్లోకి వస్తారు. ఎవరో నూటికో కోటికో ఒక్కడు ప్రజల కోసం వస్తాడు. అలాంటి నాయకులు ఈ రోజుల్లో ఉన్నారో లేరో ప్రజలకే తెలుసు.

Bjp leaders praising ap cm ys jagan
Bjp leaders praising ap cm ys jagan

ఇక.. అసలు విషయానికి వస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్నట్టుండి బీజేపీ నేతలకు ప్రేమ పుట్టుకొస్తున్నది. ఎంతలా అంటే.. ఏకంగా ప్రెస్ మీట్లలో పొగిడేంత. అవును.. ఒకప్పుడు వైసీపీ, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు ఎండుగడ్డి వేసినా భగ్గుమనడం లేదు. ఎందుకంటే.. వాళ్లు కలిసిపోయారు. మనం మనం భాయ్ భాయ్.. దోస్తులం.. హే దోస్త్ కీ.. అంటూ పాటలు పాడుకుంటున్నారు.

నిజానికి బీజేపీ నేతలు జగన్ ను ప్రశంసించడం అదేని జగన్ కు మంచి పరిణామమే. ఎందుకంటే.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అందులోనూ జనసేన కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ.. ఆ తర్వాత ఆ రెండు పార్టీలు కలిసి చేసిందయితే ఏం లేదు.

వైఎస్సార్సీపీపై బీజేపీ బాగా ఫైర్ అయింది అంటే బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడే. ఇప్పుడు సీన్ మారిపోయింది. సోము వీర్రాజు ఎప్పుడైతే బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడో.. అప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జగన్కు టీడీపీ నుంచి మాత్రమే విమర్శలు వస్తున్నాయి.

ఆన్ లైన్ జూదాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేయడంతో..

ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ జూదాన్ని రద్దు చేసింది. దీంతో బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి..జగన్ సర్కరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. చాలాకాలం నుంచి బీజేపీ కూడా ఇదే డిమాండ్ చేస్తుంది.. అదే వేరే విషయం కానీ.. ఏకంగా బీజేపీ ఉపాధ్యక్షుడే జగన్ ను పొగిడేసరికి ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.

అంతేనా… ఏపీలో ఎండీవోలకు ఎటువంటి ప్రమోషన్ లేకుండా రిటైర్ కావాల్సి వస్తోందట. అందుకే… వాళ్లను డీడీవోలుగా ప్రమోట్ చేయాలంటూ… సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వాన్ని కోరడం.. జగన్ కూడా వాళ్ల డిమాండ్ కు ఓకే చెప్పడంతో…బీజేపీ కూడా ఫుల్లు ఖుషీ అవుతోంది.

మరోవైపు… బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా సీఎం జగన్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు. టీటీడీకి సంబంధించిన ఆదాయవ్యయ రిపోర్టును కాగ్ విచారణకు ఇవ్వాలంటూ ఎంపీ జగన్ సర్కారును కోరారు. దీంతో జగన్ కూడా వెంటనే ఆ రిపోర్టును కాగ్ కు అందించారు. దీంతో సుబ్రహ్మణ్య స్వామి కూడా జగన్ ను మెచ్చుకున్నారు.

ఇలా.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రముఖులు జగన్ ను ప్రశంసల ముంచెత్తుతున్నారంటే.. ప్రధాని మోదీకి కూడా జగన్ అంటే ఇష్టమే కాబోలు అని అంటున్నారు. మొత్తానికి ప్రధాని మోదీ.. జగన్ ప్రేమలో పడిపోయినట్టున్నారు.. అంటూ రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.

author avatar
Varun G

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N