NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ ఒక్క మాటే కొంప ముంచిందా! లీగల్ విషయాల్లో ఏమరపాటు ఏలా ys jagan ?

YS Jagan Failed.. Key Issues in Supreem

ys jagan కు కు ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు జరిగిన న్యాయ పోరులో తుది విజయం నిమ్మగడ్డ దే అయినా… జగన్ టీం చేసిన కొన్ని పొరపాట్లు వల్లనే ఆయన గట్టెక్కే అనేది ఢిల్లీ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. న్యాయ విషయాల్లో ఎంతటి జాగ్రత్త తీసుకోవాలి వేసే పిటిషన్ లో ఎలాంటి పదజాలం ఉండాలి? ఒక కేసు విషయమై పిటిషన్ వేస్తే మరో దానిలో కి వెళితే యేసు ఎలా నిర్వీర్యం అవుతుంది? అనవసరంగా మధ్యవర్తులు పిటిషన్లో ఇంప్లీడ్ అయితే కోర్టు ఎలా స్పందిస్తుంది? అని అనేక విషయాలు ఈ కేసు ద్వారా అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లయింది. చాలా కేసులకు ఈ కేసు భవిష్యత్తులో మార్గదర్శకం కూడా కానుంది. జగన్ టీమ్ లో న్యాయ నిపుణులు పిటిషన్ వేసే సమయంలో… “ఎన్నికల కమిషనర్ దుర్బుద్ధితో” ఎన్నికలు జరిపించాలని కోరుతున్నారని పేర్కొనడం వల్లే… సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి మీద ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగా అహంకార ధోరణి తో ఈ పిటిషన్ వేసినట్లు జస్టిస్ పేర్కొనడం వెనుక కూడా ఈ ఒక్క పదమే మొత్తం కేసును ప్రభావితం చేసింది. పిటిషన్ లోని ఆ కీలకమైన పదాలు చూసిన న్యాయమూర్తులు అదే తీరున చివరి వరకు ఈ కేసులో ఎన్నికల కమిషన్ కు అనుకూలమైన తీర్పును వెలువరించారు.

 ఆ ఒక్క మాటే కొంప ముంచిందా! లీగల్ విషయాల్లో ఏమరపాటు ఏలా ys-jagan?
ఆ ఒక్క మాటే కొంప ముంచిందా లీగల్ విషయాల్లో ఏమరపాటు ఏలాys jagan

పదాలు జాగ్రత్త గా ఉండాలి! : ys jagan 

కోర్టులో పిటిషన్లు వేసినందున లో ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాం?? వారి హోదా ఏమిటి? పిటిషన్ లో వాడే భాష సరిగానే ఉందా? అనేవి చాలా కీలకం అవుతాయి. కోర్టులో వేసే పిటిషన్ లో ఎక్కడా వ్యక్తిగతమైన దూషణలు, ఆరోపణలు ఉండకూడదు. కేవలం చట్ట పరిధిలో మాత్రమే… చట్టాలను అతిక్రమించి ఉన్నట్లు మాత్రమే ఎదుట వ్యక్తి మీద పిటిషన్ వేయాలి. అంతేగాని ఇష్టానుసారం పదప్రయోగాలు చేసి.. ఎదుటి వ్యక్తిని దూషిస్తే అలాంటి పిటిషన్లను న్యాయమూర్తులు స్వీకరించరు. జగన్ కేసులో ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ ను పిటిషన్లో ఇష్టానుసారం నిందించడం వల్లనే ఈ కేసు మొత్తం నిర్వీర్యం అయిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.

తప్పుదోవ పట్టిస్తున్నారా?

ఈ కేసులో ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థతో పోరాడుతున్నప్పుడు దానిలో ఉండే లోటుపాట్లు.. న్యాయస్థానాల ఎదుట వ్యవహరించాల్సిన తీరు మీద ముఖ్యమంత్రి జగన్ కు న్యాయ నిపుణులే తగిన సలహాలు ఇస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకమైన అధికారాలు విధులు ఉన్నాయి. అందులోను నిమ్మగడ్డ రమేష్ కుమార్ లా చదివిన వ్యక్తి. న్యాయ విషయాల మీద పూర్తి అవగాహన ఆయనకు ఉంది. అయితే జగన్ కోటరీ లోని న్యాయ పండితులు మాత్రం జగన్ను దీనిలో పెద్ద నష్టపోయేది ఏమీ లేదని… ఖచ్చితంగా కేసులు గెలుస్తామని దానికి తగిన దారులు ఉన్నాయని తప్పుదోవ పట్టించడం వల్ల సుప్రీంకోర్టు వరకు జగన్ వెళ్ళినట్లు అర్థమవుతోంది. ఎంతో కీలకమైన అత్యవసరమైన హౌస్ మోషన్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి సైతం న్యాయ నిపుణుల సలహాలు కీలకం అయ్యాయని తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ తో వివాదం వచ్చినప్పుడే కొందరు న్యాయనిపుణులు జగన్ను హెచ్చరించినా అది ఆయనకు పట్టలేదు. ఆయన చుట్టుపక్కల ఉన్న కోటర్ ఈ మాటలు విని… దీనిలో ఖచ్చితంగా నిమ్మగడ్డను నిలువరించడం సాధ్యం అనే కోణంలోనే జగన్ అత్యున్నత న్యాయ స్థానం వరకు వెళ్లారు అనడంలో సందేహం లేదు. అంటే జగన్ చుట్టుపక్కల ఆయన శత్రువులు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. వెంటనే దీనిపై జగన్ దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఆయన కష్టమే.

ఉద్యోగులకు షాక్!

ఎన్నికల కమిషన్ ప్రభుత్వం కేసులో ముఖ్యంగా బలైపోయింది ఉద్యోగ సంఘాలు. కోర్టు ఎదుట కూడా వీరు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని కోరిన దానికి తగినట్లుగా… అనుబంధ పిటిషన్లో వేసిన ఉద్యోగ సంఘాలు వాడి లాయర్లను సైతం నియమించుకుంటున్నాయి. అయితే కనీసం న్యాయవాదుల వాదనలు వినడానికి సైతం సుప్రీంకోర్టు బెంచ్ అసలు అంగీకరించలేదు. అసలు ఈ కేసుతో మీకే మీ సంబంధం అంటూ న్యాయవాదులను ప్రశ్నించడం విశేషం. ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతున్నారని… ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట వినాల్సిందే అని న్యాయస్థానం చెప్పడం… ఢిల్లీ వెళ్లి మరీ కొరడా దెబ్బలు తిన్నట్టుగా ఉంది. ఈ తీర్పు వల్ల ఎన్నో పాఠాలు ప్రభుత్వానికి ఇప్పటికే బోధపడి ఉండాలి.. అలా కాకుండా మళ్లీ జగన్ కోటరీలో చిక్కుకొని… న్యాయపరమైన విషయాల మీద సరైన దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో పెను నష్టాలు తప్పవు. అందులోనూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కళ్లు తెరిచిన జగన్… తీర్పును స్వాగతిస్తున్నా మని కేంద్రం చేతికి తన జుట్టు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు.

author avatar
Comrade CHE

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju