NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

టీ కాంగ్రెస్ ని కాపాడేది ఎవరు..??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి మనుగడ ఉండదు అని తెలిసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ..తెలంగాణలో పట్టు నిలబెట్టుకోలేకపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది మేమే అని తెలంగాణ ప్రజలలో పార్టీ పట్ల విశ్వసనీయత ఎవరు క్రియేట్ చేసుకోలేక పోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికలలో జరిగిన మొదటి సారి ఎన్నికలలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తరువాత పట్టు కోల్పోతూ వచ్చింది.

Future looks bleak for congress partyముఖ్యంగా 2018 ముందస్తు ఎన్నికలలో గతం కంటే దారుణంగా తక్కువ స్థానాలలో పడిపోవటం తర్వాత పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్దీ తగ్గిపోతుండటం మాత్రమే కాక ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలలో అదేవిధంగా గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం గల్లంతైనట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇటువంటి గడ్డు కాలం ఎదుర్కొంటున్న పరిస్థితిలో టీ.కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం పార్టీ కి భారీ డ్యామేజ్ అని చెప్పవచ్చు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ టీ కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడి కోసం రంగంలోకి దిగింది.

రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాగూర్ హైదరాబాద్ కి వస్తున్నారు. గాంధీభవన్ లో జరగబోయే కోర్ కమిటీ  సమావేశంలో కాంగ్రెస్ నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో కొత్త పిసిసి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తం మూడు రోజులు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఠాగూర్ హైదరాబాదులో ఉండబోతున్నారు. మొదటి రోజు కోర్ కమిటీ సమావేశం, రెండో రోజు మాజీ రాష్ట్ర మంత్రులతో సమావేశం, నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకుని ఏఐసిసి కి ఒక నివేదిక రూపంలో అందించనున్నారు.

ఇదిలా ఉండగా పీసీసీ రేసులో కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేరు బలంగా వినబడుతుంది. కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వటం కంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీ బాగుపడుతుందని సీనియర్లు తెలుపుతున్నారట. మరి కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో ఠాగూర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.  

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju