NewsOrbit
రాజ‌కీయాలు

‘చంద్రబాబు బెట్టింగ్ లపై మాట్లాడొచ్చా? ‘

హైదరాబాద్: మామ ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచిన వ్యక్తి చంద్రబాబుపై ఎవరికి నమ్మకం ఉండదని వైసిపి ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వైసిపి కేంద్ర  కార్యాలయంలో  శుక్రవారం ఏర్పాటు మీడియా సమావేశంలో తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు.

-టిడిపిలో బైబై బాబు అనే గ్రూప్ తయారైందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఓటమి చెందుతున్నానని తెలిసే చంద్రబాబు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
‘క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారిపైనే కేసులు పెడుతుంటాం.  నెల్లూరు ఎంఎల్ ఏలను బెట్టింగ్ కేసులలో అన్యాయంగా ఇరికించారు. నానా రకాలుగా హింసించావు. అలాంటిది నిన్న చంద్రబాబు మాట్లాడుతూ బాంబేలో సట్టామార్కెట్, మట్కా లాగే ఉంటుంది అందులో పందాలు కట్టండి. వారు మనకు ఫేవర్ గా ఉన్నారని చంద్రబాబు స్వయంగా అన్నారంటే పరిస్దితి ఎంత దిగజారిందో తెలుసుకోవచ్చని’శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
బెట్టింగ్ గురించి మాట్లాడినందుకు చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

చట్టాన్ని గౌరవించి చంద్రబాబుపై కేసు ఫైల్ చేస్తేనే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పదవికాంక్షతో చంద్రబాబు దేనికైనా దిగజారుతున్నారని విమర్శించారు.
సిఎస్ నియామకాలలో కూడా చంద్రబాబు రాజకీయంగా విమర్శలు చేశారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ హయాంలో డిజిపిని బదిలీ చేస్తే హుందాగా వ్యవహరించారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.
విజిలెన్స్ డిజి ఏబి వెంకటేశ్వరరావును బదిలి చేస్తే చంద్రబాబు ప్రవర్తన ఎలా ఉందో అందరికి తెలిసిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ముందుగా ఈసి పరిధిలోకి ఏబి వెంకటేశ్వరరావు రారని చెప్పారని గుర్తుచేశారు.
‘ఎన్నికల పరిధిలోకి వచ్చే డిజిపిపై వైసిపి అనేక ఫిర్యాదులు ఇచ్చింది.ఈసి ఆయనపై ఎటువంటి చర్య తీసుకోలేదు’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఈవిఎంలపై చంద్రబాబుకు నమ్మకం లేనప్పుడు ఎన్నికలకు ముందు ఎందుకు మాట్లాడలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు ఎందుకు అడగలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఓటమికి సాకుల కోసమే ఈవిఎంలపై చంద్రబాబు నానాయాగి చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
టిడిపి ఓడిపోతుందని ఆరునెలల క్రితమే చంద్రబాబు పసిగట్టారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.టిడిపిలో ఎవరు మిగలరు కాబట్టి ఉన్న కొద్ది మందిని కాపాడుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

‘కర్నాటకకు,బెంగాల్ కు వెళ్లి ఎంఎల్ ఏలను జంతువుల్లా కొన్నారు.ప్రజాస్వామ్యం,చట్టం ఎక్కడ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక్కడ 23 మందిని కొన్న ఆయన ఇలా మాట్లాడటం హాస్యస్పదంగా ఉంది’ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొద్దిరోజులైనా హుందాగా ప్రవర్తించాలని ెశ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.

ఫోని తుపాను ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా పార్టీ కార్యకర్తలందరూ ప్రజలకు కావాల్సిన సహాయసహకారాలు అందించాలని వైయస్ జగన్ కోరారనీ, దేవుడు దయవల్ల తుపాను ముప్పు రాష్ర్టానికి తప్పిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Leave a Comment