కరోనా కారణంగా ఓటిటిలకు వచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కొత్త తరం దర్శకులు అతి తక్కువ బడ్జెట్ తోనే థ్రిల్లర్, క్రైమ్, మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు. ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ లతో డైరెక్టర్ ఇండస్ట్రీలోకి ఆరంగ్రేటం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. డిజిటల్ మాధ్యమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో సినిమాలు కూడా అందులోకి నేరుగా రిలీజ్ అవుతున్నాయి. అలా డిజిటల్ లో విడుదలైన మరొక చిత్రం ‘అంధకారం’ డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో డైరెక్టర్ విఘ్నరాజన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం…..
కథ
వినోద్ (అరుణ్ దాస్) క్రికెట్ శిక్షణ ఇప్పించే కోచ్. కళ్లు లేకపోయినా లైబ్రెరీలో క్లర్క్ గా పనిచేసే సూర్యం (వినోద్ కిషన్) సైకియాట్రిస్ట్ ఇంద్రన్ ఒకే నగరంలో నివసిస్తుంటారు. అకస్మాత్తుగా ఒకసారి ఒక వ్యక్తి సైకియాట్రిస్ట్ పైన తుపాకీతో కాల్పులు జరుపుతాడు. వినోద్ ను ఎవరో ఒకరు ఫోన్ లో బెదిరిస్తున్నారు. ఆస్తి కోసం సూర్యం ని కొంతమంది హత్య చేస్తారు. ఇక వీరి ముగ్గురికి ఇలా జరగడానికి కారణం ఏమిటి? ఎవరు? అసలు వీళ్ల ముగ్గురి మధ్య ఉన్న సంబంధం ఏమిటి…. అన్న విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ లు
అత్యంత ఆసక్తికరంగా ఉండే వినోద్ క్యారెక్టర్
వినోద్ కిషన్ అవుట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్
థ్రిల్లర్ కు అవసరమైన ఎలిమెంట్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
బాగా చూపించిన డార్క్ షెడ్
మైనస్ లు
సినిమా నిడివి
అక్కడక్కడ మిస్సయిన డీటెయిల్స్
మొదటి గంటలో గజిబిజి
ఎడిటింగ్
విశ్లేషణ
కేవలం ఒక మూడు నాలుగు పాత్రలకు సంబంధించిన విషయాలను పూర్తి కథ గా చిత్రీకరించడం అనేది మామూలు విషయం కాదు. ఈ రకంగా చూపించడం అంటే కత్తి తో సామే అయితే. కానీ దర్శకుడు విఘ్నరాజన్ రూపొందించిన అంధకారం ఇక్కడ మంచి మార్కులు కొట్టేసిందని చెప్పాలి. అన్ని కథలను ఒకే సమయంలో చేస్తూ బాగా థ్రిల్ క్రియేట్ చేశాడు. మొదటి సన్నివేశం నుండి సినిమా ముగిసే వరకూ… చివరి పది నిమిషాల్లో కూడా మూడు పాత్రలకు సంబంధించిన కొన్ని రహస్యాలను డైరెక్ట్ దర్శకుడు అలాగే ఉంచాడు. ఇక సన్నివేశాలని తీర్చిదిద్దిన విధానం కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది…. మొదటి అరగంట అయితే ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇక సామాన్య ప్రేక్షకుడికి ఇటువంటి కాంప్లెక్స్ స్క్రీన్‌ప్లే చూస్తే బాగా ఇబ్బంది పడతాడు. అయితే సినిమా జరిగేకొద్దీ ఒకదానికి ఒకటి బాగా లింక్ పెట్టారు. నేపథ్య సంగీతం చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీలని ఆస్వాదించే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.