The Jengaburu Curse Review: జాతి రత్నాల సినిమాతో అందరిని ఆకట్టుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కొత్త వెబ్ సిరీస్ ‘ది జెంగబూరు కర్స్’. యాక్షన్ మరియు సెంటిమెంట్ అన్ని కలగలిపి తెరకెక్కిన “ది జెంగబూరు కర్స్” వెబ్ సిరీస్ సోనీ లైవ్ లో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది.
సినిమా పేరు: ‘ది జెంగబూరు కర్స్’.
విడుదల తేదీ: 09-08-2023.
నటీనటులు: ఫరియా అబ్దుల్లా, నాజర్, మకరంద్ దేశ్ పాండే, సుధీవ్ నాయర్, మిలనై గ్రే, దీపక్ సంపత్.
దర్శకుడు: నీల మదబ్ పాండ.
నిర్మాత: రీతీష్ మోడీ.
సంగీతం: అలోకనంద దశ్ గుప్తా.
పరిచయం:
బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మైనింగ్ మాఫియా నేపథ్యంలో చాలా సినిమాలు రావటం తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో ‘ది జెంగబూరు కర్స్’ అనే వెబ్ సిరీస్ రావటం జరిగింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫరియా అబ్దుల్లా .. నాజర్ .. మకరంద్ దేశ్ పాండే ప్రధానమైన పాత్రలలో వచ్చిన ఈ సినిమా అత్యంత విలువలతో నిర్మాణం జరుపుకుంది. ఆగస్టు 9వ తారీకు నుంచి ‘సోనీ లివ్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1లో భాగంగా 7 ఎపిసోడ్స్ ను వదిలారు. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలకు పైగా నిడివిని కలిగి ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

స్టోరీ:-
లండన్ లో ఉన్నతమైన చదువులు చదివి.. ఉద్యోగం చేసే ప్రియంవద (ఫరియా అబ్దుల్లా) తన తండ్రిని వెతుక్కోవటం కోసం ఒడిస్సా అడవులకు చేరుకుంటుంది. ప్రియంవద తండ్రి పేరు స్వతంత్ర దాస్. ఆయనకు రామచంద్రన్ రావు అనే స్నేహితుడు ఉంటాడు. అయితే లండన్ లో చదువుకునే ప్రియంవదకి..రవిచందన్ రావు (నాజర్) కాల్ చేసి తండ్రి స్వతంత్ర దాస్.. కనిపించడం లేదు పోలీసులకు ఒక మృతదేహం దొరికింది.. అది మీ తండ్రి డెడ్ బాడీగా భావిస్తున్నారు. ఆ మృతదేహాన్ని గుర్తించడానికి నువ్వు భువనేశ్వర్ కి రావాలని తొందర చేస్తాడు వెంటనే ప్రియంవద లండన్ నుండి భువనేశ్వర్ కి చేరుకుంటుంది. ఇక స్వతంత్ర దాస్ నేపథ్యం చూసుకుంటే అతను ఒక ప్రొఫెసర్. రాష్ట్రంలో అడవులను ఇంకా అడవులను నమ్ముకుని బతికే గిరిజనుల కోసం పోరాడే వ్యక్తి. అయితే భువనేశ్వర్ అడుగులలో జరుగుతున్న మైనింగ్ నీ అడ్డుకున్న స్వతంత్ర దాస్ మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి మళ్లీ బయటికి వచ్చి పోరాడుతూ ఉంటాడు. అయితే ఉన్నట్టుండి స్వతంత్ర దాస్ కనిపించక పోవటంతో తన తండ్రిని వెతుకులాంటి క్రమంలో మృతదేహాన్ని చూసిన ప్రియంవద.. అది తన తండ్రి డెడ్ బాడీ కాదని తెలుసుకుని గుర్తించి ఊపిరి పీల్చుకుంటుంది. ఇక తన తండ్రిని వెతుకులాటే విషయంలో ప్రియంవదా భువనేశ్వర్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ రహస్యాలు ఎలా బట్టబయలు చేసిందనేది మిగతా స్టోరీ.
విశ్లేషణ:
‘ది జెంగబూరు కర్స్’ అంటే జెంగబూరు శాపం అనీ అర్థం. ప్రియా పాత్రలో ఫరీయా అబ్దుల్లా అద్భుతంగా నటించింది. ఆమె చుట్టూనే ఈ వెబ్ సిరీస్ ఎక్కువగా నడుస్తుంటాది. ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ మైనింగ్ మాఫియాగా కథను నడిపించడంలో డైరెక్టర్ చాలా హైలెట్. ముఖ్యంగా పాత్రకి తగ్గట్టు నటీనటులను ఎంచుకోవడంలో సక్సెస్ సాధించడనీ చెప్పవచ్చు. స్క్రీన్ ప్లే అదరగొట్టింది. ఒకవైపు గిరిజనులు వారి కోసం పోరాడే నిజాయితీపరులు మరోవైపు మైనింగ్ మాఫియాల తీరుతో ఈ వెబ్ సిరీస్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని. కథలో ప్రతి పాత్ర ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. చాలా క్లీన్ వెబ్ సిరీస్ తో… ఎక్కడా కూడా అశ్లీలకు చోటు లేకుండా బలమైన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందించడం జరిగింది. తండ్రి కోరికను నెరవేర్చడం కోసం ఒక యువతి కొనసాగించిన పోరాటంగా కూడా భావించవచ్చు. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. అడ్వెంచర్ ‘ది జెంగబూరు కర్స్’..వెబ్ సిరీస్.
ప్లస్ పాయింట్స్:
లొకేషన్స్.
నటీనటులు.
కథ.
నిర్మాణ విలువలు.
స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫోటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ సాగదీత సీన్స్.
ప్రాధాన్యం లేని కొన్ని పాత్రలు.