NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Pulimada Review: జోజు జార్జ్ థ్రిల్లర్ మాస్టర్ పీస్ ‘పులిమడ’ మూవీ రివ్యూ..!!

Pulimada Review: మలయాళంలో జోజు జార్జ్ కి నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ఆయన ఓటీటీ సినిమాలకు.. విపరీతమైన ఆదరణ ఉంది. జోజు జార్జ్ గతంలో నటించిన జోసెఫ్, ఇరాట్ట, నాయట్టు వంటి సినిమాలు ఆయనకు మలయాళంలో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కాగా ఇప్పుడు ఆయన నటించిన “పులిమడ” నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో అక్టోబర్ 20వ తారీకు ఈ సినిమా థియేటర్ లలో విడుదలయ్యింది.

మూవీ : పులిమడ
నటీనటులు: జోజు జార్జ్, ఐశ్వర్య రాజేశ్, చెంబన్ వినోద్ జోస్, లిజిమోల్ జోస్, జానీ ఆంటోనీ తదితరులు
ఎడిటింగ్: ఏకే సజన్
సినిమాటోగ్రఫీ: వేణు
మ్యూజిక్: అనిల్ జాన్సన్
నిర్మాతలు: దామోదరన్
దర్శకత్వం: ఏకే సజన్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్

Joju George masterpiese movie Pulimada Review Telugu

పరిచయం:

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఓటిటి హవా నడుస్తోంది. ఒకప్పుడు సినిమా ధియేటర్లకు ఆశ్రయించే సినీ లవర్స్ ఇప్పుడు ఓటిటి కంటెంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఉన్న కొద్ది ఓటిటి ప్లాట్ ఫామ్ లు పెరిగిపోతూ ఉన్నాయి. నాలుగు సినిమాలు చూసే ఖర్చు ఒక ఏడాది సబ్స్క్రిప్షన్ ఖర్చు.. పెట్టి పరిస్థితి ఉండటంతో ఓటీటీ సినిమాలకు జనం బాగా అలవాటు పడటం జరిగింది. ఐదు ఇతర భాషలకు చెందిన సినిమాలు కూడా చూడొచ్చు. ఈ రకంగా ఓటీటీ లలో… అనేక సినిమాలు విడుదలయ్యి.. ఇతర భాషల్లో అనువదించి నిర్మాతలు భారీగా సొమ్ములు చేసుకుంటున్నారు. తాజాగా ఈ రీతిగానే మలయాళంలో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన “పులిమడ” అక్కడ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇటీవలే నవంబర్ 23 వ తారీకు నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి సినిమా ఎలా ఉంది..? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా.. అన్ని విషయాలు తెలుసుకుందాం. జోజూ జార్జ్, ఐశ్వర్య రాజేష్ లు కలిసి ఈ సినిమా చేయడం జరిగింది. మరి సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం..

Joju George masterpiese movie Pulimada Review Telugu

స్టోరీ:

విన్సెంట్ (జోజు జార్జ్) అనే సివిల్ పోలీస్ కానిస్టేబుల్ కి 40 సంవత్సరాలు వయసొచ్చిన పెళ్లి కాదు. తండ్రి చిన్నతనంలోనే చనిపోతాడు. తల్లి మానసిక రోగిగా ఉండి కొన్ని సంవత్సరాలకు చనిపోతుంది. ఈ క్రమంలో ఎన్ని సంబంధాలు చూసిన ఏదో కారణంతో పెళ్లి దాకా సాగే పరిస్థితులు ఉండవు. కానీ ఎట్టకేలకు జెస్సి అనే అమ్మాయి.. పెళ్లికి ఒకే చెప్పటం జరుగుద్ది. దీంతో జెస్సి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి విన్సెంట్ రెడీ అయిన క్రమంలో పెళ్లి మరికొన్ని గంటల్లో ఉందన్నగా.. జెస్సీ ప్రేమించిన వ్యక్తితో లేచిపోతుంది. ఈ సంఘటనతో విన్సెంట్ ఎంతో తలడిల్లిపోయి చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చుని తాగుతుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎమీలీ జార్జ్ (ఐశ్వర్య రాజేష్) ఎదురవుతుంది. సరిగ్గా అడవి ప్రాంతంలో ఆమె కారు రిపేర్ రావడంతో అదే సమయంలో.. పులి సంచరిస్తూ ఉందని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రకటన చేస్తారు. ఈ ప్రకటనతో ఎమీలీ జార్జ్.. మరింతగా భయపడి వెంటనే తల దాచుకోవాలని ప్రయత్నించగా అదే అటవీ ప్రాంతంలో విన్సెంట్ ఇంటి వద్దకు వెళ్లడం జరుగుద్ది. కారు ట్రబుల్ ఇచ్చిందని తెల్లవారు వరకు తనకు ఆశ్రయం ఇవ్వాలని.. విన్సెంట్ ని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి విన్సెంట్ ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో విన్సెంట్ ఇల్లు మొత్తం చూసి డెకరేషన్ అంతా గమనించి విషయం తెలుసుకుంటది. ఆ రకంగా..ఎమీలీ జార్జ్, విన్సెంట్ మధ్య మాటలు కలుస్తాయి. ఆ రాత్రి గడిచాక తెల్లవారేసరికి ఎమీలీ జార్జ్.. రక్తపు మడుగులో పడి ఉంటుంది. ఈ సన్నివేశం చూసి విన్సెంట్ భయపడిపోతాడు. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగింది..? ఎమీలీ జార్జ్ ఎవరు..? చివర ఆఖరికి విన్సెంట్ కి పెళ్లి అయ్యిందా లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Joju George masterpiese movie Pulimada Review Telugu

విశ్లేషణ:

పులిమడ గురించి చెప్పుకోవాల్సి వస్తే వేణు అందించిన ఫోటోగ్రఫీ సినిమాకి చాలా హైలెట్. నైట్ ఎఫెక్ట్స్ లో తీసిన సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. పాటలు బాగోకపోయినా గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నంతలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాది. ఎడిటింగ్ సైతం సినిమాని చాలా స్పీడ్ గా నడిపిస్తూ ఉంటది. “పులిమడ” అంటే పులిగుహ. మరి సినిమాలో పులికి హీరోకి మధ్య సంబంధం ఏమిటి.. అనేదాన్ని జస్టిఫికేషన్ చేయడంలో దర్శకుడు గురి తప్పడు అని చెప్పొచ్చు. ఫస్ ఆఫ్ లో సస్పెన్స్ ఎక్కడ ఉండదు. సాగదీత  సన్నివేశాలు చాలా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో సైతం.. అసలు కథ ప్రారంభమైన సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్షా అన్నట్టు ఉంటాయి. చాలావరకు డాక్యుమెంటరీ సినిమా చూస్తున్నట్లు ఫీలింగ్ కలుగుద్ది. సినిమాలో పులి కనబడే పది నిమిషాలు మాత్రం కాస్త సస్పెన్స్ ఫీల్ కలుగుతుంది. ఎమిలీ పాత్ర మినహా మిగతా పాత్రలకు అంతగా ప్రాముఖ్యత ఉండదు. సినిమాలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. కుటుంబంతో కలిసి చూడలేం. స్టోరీలో దమ్ము లేకపోవడం.. కథనం సాగే తీరు కూడా.. నీరసంగా ఉన్నట్టు ఉండటం సినిమాకి అతిపెద్ద మైనస్. జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ గ్లామర్ రోల్ లో పరవాలేదు అనిపించారు. ఓవరాల్ గా చూసుకుంటే.. సహనం ఇంకా ఓపిక ఎక్కువ ఉన్నవాళ్లు కుటుంబంతో కాకుండా ఒంటరిగా పులిమడ సినిమాని చూడొచ్చు.

Related posts

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu