NewsOrbit
రివ్యూలు

ఇదేమి సినిమా బాబోయ్

విలక్షణ నటుడు సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో కార్తీ. తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవ్’. స్పోర్ట్స్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రిస్క్ చెయ్యడమంటే ఇష్టమైన దేవ్ కి అందరిలా చేయడం ఇష్టం ఉండదు, తనకి నచ్చినట్లు జీవించడం, నచ్చిన పని చెయ్యడంలోనే ఆనందం ఉందని భావిస్తాడు. ఫ్రీడమ్ ని పీక్ స్టేజ్ లో ఎంజాయ్ చేస్తున్న వాడి జీవితంలోకి మేఘన వస్తుంది. చిన్న వయసులోనే ఒక కంపనీకి సీఈఓ అయిన మేఘన, దాన్ని సక్సస్ ఫుల్ గా నడిపించే విధానం చూసి దేవ్ ఆమె ప్రేమలో పడతాడు. రిస్క్ చెయ్యడం, నచ్చినట్లు ఉండడం అలవాటైన దేవ్, అన్నీ కరెక్ట్ గా జరగాలనుకునే మేఘనల జీవితం ఎలా సాగింది అనేదే ఈ దేవ్ సినిమా కథ.

‘దేవ్’లో హీరో అడ్వెంచర్స్ ఇష్టపడే కుర్రాడు అంటే సినిమాలో చాలా అడ్వెంచర్స్ చూడబోతున్నామని అనుకుంటాం, డిఫరెంట్ సర్ప్రైస్ లో ఆశిస్తాం కానీ కథ ముందుకు సాగే కొద్దీ ఏ సర్ప్రైజ్ లేకుండా ‘దేవ్’ని ఒక సాధారణ సినిమాగా నడిపించేయడమే తీవ్ర నిరాశకు గురి చేసింది. లీడ్ పెయిర్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నా కూడా దాన్ని నిలబెట్టే స్ట్రెంగ్త్ కానీ వారి మధ్య అంత ప్రేమ పుట్టడానికిగల కారణాలు కానీ కథలో లేవు.. చప్పగా సాగిన కథనం… ఆడియన్స్ సహనాన్ని పరీక్షించే సీన్స్… మొత్తంగా కలిపి ‘దేవ్’ సినిమా ఓ రెండున్నర గంటల బోరింగ్ వ్యవహారంగా మారింది. కొత్తదనం కోరుకుంటున్న ప్రేక్షకులకి మంచి సినిమాని ఇవ్వాల్సింది పోయి అడ్వెంచర్ పేరుతో అస్సలు ఎగ్జైట్ చెయ్యని ‘దేవ్’ క్లైమాక్స్ వరకూ వరకు చాలా బోరింగ్ గా, మన సహనాన్ని పరీక్షించేలా సాగిపోతుంది.

దేవ్ పాత్రలో కనిపించిన కార్తీ ఆకట్టుకున్నాడు, పాత్రకి తగ్గట్లు తన లుక్, యాక్టింగ్ రెండూ మార్చుకోని కొత్తగా కనిపించాడు. ఎప్పటిలాగే రకుల్ చాలా అందంగా కనిపించింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్ వాల్యూ ఉన్న ఆర్టిస్టులు ఇలాంటి పాత్రల్ని ఎలా ఒప్పుకున్నారో అనిపిస్తుంది. మిగిలిన వారి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అసలు కథలోనే చెప్పుకోవడానికి ఏమీ లేదు. సాంకేతికంగా టాప్ నాచ్ లో ఉన్న ‘దేవ్’ సినిమాని నిండా ముంచింది దర్శకుడే. కథాకథనంలో కాస్త జాగ్రత్త తీసుకోని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది కానీ దర్శకుడు రజత్ ‘దేవ్’ ని ఇంత దారుణంగా తీస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించి ఉండరు.

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment