NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Adikeshava Review: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ రొటీన్ ఫ్యాక్షన్ రివెంజ్ డ్రామా “ఆదికేశవ” మూవీ రివ్యూ..!!

Adikeshava Review: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన సినిమా “ఆదికేశవ”. ఎన్ శ్రీకాంత్  రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 24వ తారీకు సినిమా విడుదల కావడం జరిగింది. మరి సినిమా రివ్యూ ఏంటో తెలుసుకుందాం.

నటినటులు:పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సుమన్, తదితరులు
దర్శకత్వం:శ్రీకాంత్ ఎన్ రెడ్డి
నిర్మాత:సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం:జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫీ:డడ్లీ

Panja Vaishnav Tej Routine Faction Revenge Drama Adikeshava Movie Review
పరిచయం:

మెగా హీరోలలో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న హీరో పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమా “ఉప్పెన”తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. పైగా వైష్ణవ్ కళ్ళు.. మెగాస్టార్ చిరంజీవి మాదిరి ఉన్నాయని పేరు సంపాదించుకొని ఆ రీతిగానే.. ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. పాపులారిటీ కంటే నటుడిగా వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ.. తనలో ఉన్న నటనను వెండితెరపై కనపరుస్తున్నాడు. తాజాగా ఈ రీతిగానే ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో “ఆదికేశవ” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. చాలా వాయిదాల తర్వాత ఇటీవల ఈ సినిమా విడుదల అయ్యింది. ఉప్పెన తర్వాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న.. వైష్ణవ తేజ్.. “ఆదికేశవ” సినిమాతో ఏ రకంగా అలరించాడో తెలుసుకుందాం.

Panja Vaishnav Tej Routine Faction Revenge Drama Adikeshava Movie Review

స్టోరీ:

ఒక సేల్స్ డిపార్ట్మెంట్ కంపెనీలో బాలు (వైష్ణవ్ తేజ్) పనిచేస్తుంటాడు. అదే కంపెనీ ఓనర్ కూతురు చిత్ర (శ్రీలీల) బాలు పై మనసు పారేసుకుంటది. బాలు సొంత ఊరు రాయలసీమ ప్రాంతం. అయితే అనుకోకుండా వాళ్ల కుటుంబం సిటీకి వచ్చేసి స్థిరపడటం జరుగుతుంది. బాలుకి రాయలసీమ ప్రాంతంలో తన కుటుంబానికి జరిగిన విషయాలు పెద్దగా తెలియవు. కాగా బాలు తన తల్లిదండ్రులు మరియు అన్న ఇంకా కుటుంబ సభ్యులందరితో సిటీలో హాయిగా గడిపేస్తుంటాడు. మరోపక్క చిత్రతో ప్రేమాయణం సాగిస్తాడు. ఇలా బాలు జీవితం హాయిగా ఉన్న సమయంలో.. అనుకోకుండా రాయలసీమలో ఒకరి చావు గురించి వర్తమానం అందుతుంది. ఇదే క్రమంలో సీమలో చెంగారెడ్డి (జోజు జార్జి) అరాచకాలు నడుస్తుంటాయి. దీంతో బాలు రాయలసీమకు వెళ్లాల్సి వస్తుంది. రాయలసీమలో తన పేరు రుద్ర కాలేశ్వర్ రెడ్డి అని బాలు కొత్త విషయాన్ని తెలుసుకుంటాడు. బాలు తండ్రి మహాకాళేశ్వర రెడ్డి (సుమన్). రుద్ర తండ్రి మహాకాళేశ్వర రెడ్డినీ ఎవరు చంపుతారు..? రాయలసీమలో అడుగుపెట్టిన రుద్ర ఏం చేశాడు..? చెంగారెడ్డితో బాలు అలియాస్ రుద్రకి ఉన్న వైరం ఏంటి అనేది మిగతా సినిమా.

Panja Vaishnav Tej Routine Faction Revenge Drama Adikeshava Movie Review

విశ్లేషణ:

“ఆదికేశవ” స్టోరీ పెద్దకొత్తేమీ అనిపించదు. ఇలాంటి ఫార్మేట్ లో చాలా సినిమాలు రావడం జరిగాయి. సినిమాలో కొత్తదనం ఎక్కడా కూడా కనిపించదు. రెండు గంటలపాటు స్టోరీ అలా వెళ్ళిపోతుంటది. ప్రేక్షకుడికి ఫీల్ కలిగే సన్నివేశాలు ఎక్కడ ఉండవు. సినిమాకి మెయిన్ మైనస్ స్టోరీ. టెక్నికల్ గా లేదా మ్యూజిక్ పరంగా కూడా చెప్పుకోదగ్గ స్టాఫ్ సినిమాలో లేదని చెప్పొచ్చు. జీవి ప్రకాష్ సంగీతం అసలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. తన స్థాయి మ్యూజిక్ ఇవ్వలేదు. అసలు ఈ సినిమాకి ఆయనే పనిచేశాడా లేదా ఇంకెవరితోనైనా చేపించాడా అనే అనుమానం కలుగుతుంది. సినిమాకి ప్రధాన డ్రా బ్యాక్ స్టోరీ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమా ప్రధాన భాగంలో హీరో పాత్రను చాలా రొమాంటిక్ సైలెంట్ గా చూపించి సెకండ్ హాఫ్ లో చాలా వైలెంట్ గా చూపించారు. క్లైమాక్స్ కూడా ట్విస్ట్ ఇవ్వకుండా ఆడియన్స్ ఊహించిన రీతిలోనే కథ ముగుస్తుంది. సెకండాఫ్ లో చాలా సన్నివేశాలు ఘోరంగా ఉంటాయి. వైష్ణవి తేజ్ ఎక్కడ కూడా న్యాచురల్ గా కనిపించలేదు. కొన్ని సార్న్ని వేషాలలో ఓవరాక్షన్ చేశాడు అన్న ఫీలింగ్ కలుగుద్ది. శ్రీలీల గ్లామర్ గా ఇంకా డాన్స్ పరంగా తన వంతు న్యాయం సినిమాకి చేసింది. ఆమె పాత్రకి కూడా అంత పెద్ద స్కోప్ లేదు. మొత్తంగా చూసుకుంటే “ఆదికేశవ” రొటీన్ కథతో తేలిపోయే సన్నివేశాలు కలిగిన కమర్షియల్ ఫార్ములతో తీసిన సినిమా. ఏ రకంగా కూడా సినిమాలో చెప్పుకోవడానికి ఏది లేదు. ఈ దెబ్బతో నవంబర్ 24వ తేదీ విడుదలైన ఈ సినిమా ఇప్పుడు.. డిసెంబర్ నెలలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. సాధారణంగా సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీ లోకి.. తీసుకొచ్చే సాంప్రదాయం ఉంటుంది. కానీ “ఆదికేశవ” సినిమా ఫలితం.. భయంకరమైన డిజాస్టర్ కావడంతో వచ్చే సంక్రాంతికి ఓటీటీ లోకి రావాల్సి.. ఉండగా దానికంటే ముందుగానే డిసెంబర్ నెలలోనే విడుదల చేయడానికి సినిమా యూనిట్ రెడీ కావడం జరిగింది.

Related posts

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri