NewsOrbit
రివ్యూలు

`సూర్య‌కాంతం` రివ్యూ

నిహారిక కొణిదెల సినిమా చేస్తే అర్థ‌వంతంగా ఉంటుంది. ఏదో కొత్త‌ద‌నం, ఏదో ఆలోచింప‌జేసే పాయింట్ లేక‌పోతే నిహారిక సినిమా అంగీక‌రించ‌దు అనే పేరు ఉంది. ఆమె న‌టించిన తాజా సినిమా `సూర్య‌కాంతం`. తెలుగు వారి మ‌ధ్య సూర్య‌కాంతం అనే పేరుకే ఓ బ్రాండ్ ఉంది. ఓ కంట్లో అల్లం, ఓ కంట్లో బెల్లం పెట్టుకుని చూడ‌టం ఎలాగో `గుండ‌మ్మ క‌థ‌`లో సూర్య‌కాంతాన్ని చూస్తే తెలుసుకోవ‌చ్చు. అలాంటి సూర్య‌కాంతం లాంటి ల‌క్ష‌ణాలున్న అమ్మాయి క‌థ‌తో తెర‌కెక్కిన తాజా సినిమా `సూర్య‌కాంతం` ఎలా ఉందో చ‌దివేయండి. ఆల‌స్య‌మెందుకు?

నిర్మాణ సంస్థ‌: నిర్వాణ సినిమాస్
పాత్ర‌ధారులు: నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లెన్ భేసానియా , శివాజీ రాజా, సుహాసిని, సత్య
చిత్ర స‌మ‌ర్ప‌కుడు : వరుణ్ తేజ్
ఛాయాగ్రాహ‌కుడు: హరిజ్ ప్రసాద్
సంగీత ద‌ర్శ‌కుడు : మార్క్ కె రాబిన్
క‌ళ‌ : అవినాష్ కొల్ల
లిరిక్స్ : కృష్ణ కాంత్
కూర్పు : రవితేజ గిరిజాల
ద‌ర్శ‌క‌త్వం: ప్రణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి
నిర్మాత‌లు : సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోలు, రామ్ నరేష్
కార్య‌నిర్వాహ‌క నిర్మాత‌ : రాజ్ నిహార్

క‌థ‌:
సూర్యకాంతం(నిహారిక కొణిదెల‌) అంద‌రితో క‌లివిడిగా, స‌ర‌దాగా ఉండే అమ్మాయి. త‌ల్లి(సుహాసిని) పెళ్లి చేసుకోమంటున్నా త‌ప్పించుకుని తిరుగుతుంటుంది. ఇలాంటి అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు అభి(రాహుల్ విజ‌య్‌). ఆమెను వెంబ‌డిస్తాడు. అభితో ప‌రిచం ఉన్నా కూడా అత‌నికి త‌న పేరు కూడా చెప్ప‌దు. ఓరోజు త‌న కోసం అభి ఆమె ఇంటికి వెళితే అక్క‌డే ఉన్న ఆమె త‌ల్లి త‌న పేరు సూర్య‌కాంతం అని చెబుతుంది. త‌న‌కు జీవితాంతం స‌పోర్ట్ చేయ‌మ‌ని కోరుతుంది. అభి కూడా స‌రేనంటాడు. కొన్నిరోజుల‌కే సూర్య‌కాంతం త‌ల్లి హార్ట్ ఎటాక్‌తో చనిపోతుంది. ఆమె త‌ల్లికి ఇచ్చిన మాట ప్ర‌కారం అభి..సూర్య‌కాంతానికి అండ‌గా నిల‌బ‌డ‌తాడు. ఓరోజు త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను చెబుతాడు. కానీ సూర్య‌కాంతం ఏమీ చెప్ప‌కుండా సిటీ వ‌దిలేసి వెళ్లిపోతుంది. బాధ‌తో అభి ఏడాది పాటు ఎదురుచూసి .. ఇక సూర్య‌కాంతం రాద‌నుకుని ఇంట్లో చూసిన అమ్మాయి పూజా(పెర్‌లెనె)ను పెళ్లి చేసుకోడానికి సిద్ధ‌మ‌వుతాడు. ఇద్ద‌రికీ రెండు రోజ‌ల్లో ఎంగేజ్‌మెంట్ ఉందనే స‌మయంలో అభి జీవితంలోకి మ‌ళ్లీ సూర్య‌కాంతం ఎంట్రీ ఇస్తుంది. సూర్య‌కాంతం గురించి పూజ‌కు ముందే చెప్పిన అభి.. త‌న పెళ్లి విష‌యాన్ని దాస్తాడు. అనుకోకుండా సూర్య‌కాంతం.. త‌న‌కు ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు త‌న పెళ్లి విష‌యాన్ని చెబుతాడు. అప్పుడు సూర్య‌కాంతం ఏమంటుంది? పూజ, సూర్య‌కాంతంల‌లో చివ‌రికి అభి ఎవ‌రిని పెళ్లి చేసుకుంటాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

స‌మీక్ష‌:
మూడు పాత్ర‌ల మ‌ధ్య సాగే చిత్రమిది. ప్రేమ‌, పెళ్లి అనే రెండు విష‌యాలు.. మూడు పాత్ర‌ల మ‌ధ్య ఎలాంటి ఎమోష‌న్స్‌ను క‌లిగించాయ‌నేదే ప్ర‌ధాన సినిమా. చివ‌ర‌కు ఎలాంటి మ‌లుపు తీసుకుందో తెలియాలంటే.. ముందు పాత్ర‌ల తీరు తెన్నులు చూద్దాం. సినిమా టైటిల్ పాత్ర‌ధారి నిహారిక జోవియ‌ల్‌గా ఉండే పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. గ‌త రెండు చిత్రాల కంటే ఈ చిత్రంలో ఆమె న‌టన ఆక‌ట్టుకుంది. అయితే పాత్ర‌కున్న ప్రాముఖ్య‌త రీత్యా ఇంకా బాగా చేసుండొచ్చు అనే భావన కూడా క‌లిగింది. ఇక మ‌రో పాత్ర హీరో రాహుల్ విజ‌య్‌. హీరో అంటే ఫైట్స్‌, డ్యాన్సుల‌నే కాకుండా కూల్‌గా సాగే పాత్ర‌లో న‌టించ‌డం త‌న ఓపెన్ మైండ్‌కు తార్కాణం. త‌న పాత్ర ప‌రంగా ఆక‌ట్టుకున్నాడు. ఇక పెర్‌లెనె అనే న‌టి పాత్ర‌. ఈ పాత్ర సెకండాఫ్‌లో వ‌స్తుంది. చేసుకోబోయే వాడి నుండి నిజాయ‌తీని కోరుకునే ఈ పాత్ర‌లో పెర్‌లెనె త‌న ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. ఇక శివాజీ రాజా, సుహాసిని ఇలా ఆయా పాత్ర‌లు వాటి వాటి పాత్ర‌ల‌క‌నుగుణంగా చ‌క్క‌గా మెప్పించారు. ఇక సాంకేతికంగా చూస్తే ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్‌.. పాత్ర‌ల‌ను, సన్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా, గ్రిప్పింగ్‌గా మ‌లుచుకుని ఉండాల్సింది. ఫ‌స్టాఫ్ అంతా ప్రేమ స‌న్నివేశాల‌తో ఉంటాయి. ఇక సెకండాఫ్ అంతా కామెడీ కంటే ఎమోష‌న్స్ మీద ప్ర‌ధానంగా న‌డుస్తుంది. టైటిల్ పాత్ర‌ధారి హీరో పెళ్లి చెడ‌గొట్టాల‌నుకోవ‌డం.. స‌న్నివేశాల‌తో న‌డుస్తుంది. క్లైమాక్స్ బావుంది. మార్క్ కె.రాబిన్ సంగీతంలో పొ పొ పొవే పొవే ప్రేమ‌… అంటూ సాగే పాట‌.. నేప‌థ్య సంగీతం బావుంది. హ‌రిజ్ ప్ర‌సాద్ కెమెరా ప‌నితనం ఆక‌ట్టుకుంది. మొత్తంగా సినిమా ల్యాగింగ్ అనిపిస్తుంది.

బోట‌మ్ లైన్‌.. సూర్య‌కాంతం.. ఎఫ‌ర్ట్‌లెస్‌
రేటింగ్‌: 2.25/5

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment