టెక్నాలజీ ట్రెండింగ్

Electric Bike Accident’s: హైఅలర్ట్..ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదాలలో నీళ్లు జల్లితే విధ్వంసమే..!!

Share

Electric Bike Accident’s: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పేలుడు ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల నుండి వస్తున్న ఫిర్యాదుల పై ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీల విషయంలో పునరాలోచనలో పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి ఇంటిలోనే చార్జింగ్ పెడుతుంటే.. బ్యాటరీలు పేలిపోయి.. సదరు ఇళ్ళల్లో ఉండే మనుషులు అనేక గాయాలతో మరణిస్తూ మరికొంతమంది మంచానికి పరిమితం అవుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పేలుడు జరిగిన సమయంలో నీళ్లు జల్లి.. మంటలను అదుపులోకి తీసుకోవాలన్న మంటలు అదుపులోకి రావడం లేదని.. తాజాగా తమిళనాడులో జరిగిన ఎలక్ట్రిక్ బైక్ పేలుడు ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

High alert..don't use water In electric bike accidents

ఇటీవల తమిళనాడులో.. ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసి ఇంటిలో చార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాటరీలో మంటలు చెలరేగి పోయాయి. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులు..చుట్టూ పక్కల స్థానికులు మంటలను ఆర్పాలని నీళ్ళు పోసారు. తొలుత మంటలు తగ్గినా… ఆ తర్వాత కొద్ది క్షణాలకు వాహనం పెద్ద శబ్దంతో పేలి పోయింది. దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు అంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సాధారణంగా నీళ్లు పోస్తే మంటలు అదుపులోకి వచ్చి తగ్గిపోవాలి. కానీ ఈ ఘటనలో రివర్స్ అయ్యింది. ఏకంగా వాహనమే పేలిపోవడంతో.. ఎలక్ట్రిక్ వాహనాలకి సంబంధించి మంటలు అదుపులోకి తీసుకోవడం ఎలా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. పరిస్థితి ఇలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చల్లా రేగితే అదుపులోకి తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు వాడకూడదని లేటెస్ట్ గా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలలో ఉండే బ్యాటరీ సెల్ లో హైడ్రోజన్ వాయువు, లిథియం హైడ్రాక్సైడ్ వంటి రసాయనాలు ఉంటాయి. అయితే హైడ్రోజన్ వాయువుకు మండే స్వభావం ఉండటంతో… ఎట్టి పరిస్థితుల్లో కూడా.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ మంటలు చెలరేగిన సమయంలో నీళ్లు ఉపయోగించకూడదని.. ఉపయోగిస్తే తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే ఈ మంటలను అదుపులోకి తీసుకోవడానికి ఏబిసి పౌడర్ మాత్రమే చల్లాలని..నిపుణులు సూచించారు. ఇదిలా ఉంటే రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు ఘటనలు పెరిగిపోతుండటంతో వినియోగదారులు సైతం.. ఎలక్ట్రిక్ వాహనాలు అంటే భయపడే పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంది.


Share

Related posts

Digestive System: చక్కటి జీర్ణ వ్యవస్థ కోసం ఈ సింపుల్ చిట్కా..!!

bharani jella

Devatha Serial: దేవత సీరియల్ లో వచ్చేవారం ఎవరు ఊహించని హైలెట్ సీన్ ఇదే..!

bharani jella

Kerala Doctors: సాహసయాత్ర చేసి వైద్యం అందించిన కేరళ వైద్యులు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar