టైమెక్స్ గ్రూప్ మరో నూతన స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఐకనెక్ట్ పేరిట ఫిట్నెస్ ప్రధానాంశంగా ఈ వాచ్‌ను రూపొందించారు. ఈ వాచ్ సిలికాన్, స్టెయిన్లెస్ స్టీల్ మోడల్స్‌లో అందుబాటులో ఉంది. ఇక ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
టైమెక్స్ ఐకనెక్ట్ వాచ్‌లో 1.4 ఇంచుల టచ్ స్క్రీన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ కేస్ టాప్ పైభాగంలో ఉంటుంది. ఈ వాచ్‌ను చాలా లైట్ వెయిట్‌గా ఉండేలా రూపొందించారు. అందువల్ల వినియోగదారులకు ఈ వాచ్ ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ వాచ్‌కు ఐపీ 68 రేటింగ్‌ను ఇచ్చారు. అందువల్ల వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లభిస్తుంది.
ఈ వాచ్‌ను ఫిట్ నెస్ ప్రియుల కోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్ రేట్, మానిటరింగ్, స్లీప్ రేట్ ట్రాకింగ్, సెడెంటరీ రిమైండర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్‌ను కూడా ఇందులో ఇచ్చారు.
ఐకనెక్ట్ వాచ్ ను ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు బ్లూటూత్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. టైమెక్స్ 2 యాప్‌ను ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫోన్‌ను వాచ్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీంతో ఫోన్లోని టెక్ట్స్, కాల్స్, క్యాలెండర్స్ తదితర నోటిఫికేషన్లు వాచ్ తెరపై కనిపిస్తాయి. ఈ వాచ్ 5 రోజుల బ్యాకప్‌ను ఇస్తుంది. ఈ వాచ్‌కు చెందిన సిలికాన్ స్ట్రాప్ మోడల్ ధర రూ.6,995 ఉండగా, స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ ధర రూ.7,295గా ఉంది. ఈ వాచ్‌ను ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్ లైన్ స్టోర్స్ లోనూ కొనుగోలు చేయవచ్చు.