NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Priyanka Gandhi: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు 2 లక్షల ఉద్యోగాలు’

Share

Priyanka Gandhi: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదివారం ఆదిలాబాద్ జిల్లా  ఖానాపూర్, అసిఫాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసిఆర్ సర్కార్ తీరుపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అమలు చేసే పథకాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు ప్రియాంక గాంధీ. కేసీఆర్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వారి కుటుంబాలను విస్మరించారన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పతాకస్థాయిలో ఉందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం బడాబాబులకు పెట్టుబడి దారులకు, ధనవంతులకే పనిచేస్తోందని అన్నారు. కాళేశ్వరం, మిషన్‌భగీరథ పథకాల్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపరు లీకేజీల ద్వారా ఎంతో మంది యువకుల భవిష్యత్‌ను నాశనం చేసిన ఘనత కేసీఆర్‌ సర్కార్ కు దక్కుతుందని అన్నారు. ప్రజల సొమ్మును బీఆర్‌ఎస్‌ సర్కార్ దోచుకుంటోందని అన్నారు.

ప్రధాని మోదీ కాళేశ్వరం, లిక్కర్‌స్కాం గురించి మాట్లాడకుండా కాంగ్రెస్‌ నాయకులపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌, మోదీ ఇద్దరూ ఒకటేనని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లేనన్నారు. అమరవీరుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకొని వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.  రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.

పంటలకు కనీస మద్దతు ధర పెంచుతామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2500, రూ.500కే గ్యాస్‌ కనెక్షన్‌, రైతు భరోసా కింద ఏడాదికి రూ.15వేలు, కౌలు రైతులకు రూ.12వేలు, గృహజ్యోతి కింద 200యూనిట్లు ఉచితంగా విద్యుత్‌, ఇందిరమ్మ ఇండ్ల కోసం స్థలంతో పాటు రూ.5లక్షలు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు, వృద్ధులకు నెలకు పెన్షన్‌కింద రూ.4వేలు ఇస్తామని హామీలు ఇచ్చారు.

Vijayasanthi: విమర్శకులకు విజయశాంతి ఇచ్చిన సమాధానం ఇదే


Share

Related posts

” జగన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు ” అతిపెద్ద ఆరోపణ .. వీడియో ప్రూఫ్ తో సహా ! 

sekhar

ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు మరో వరం ‘టోఫెల్’

somaraju sharma

Sreekaram : ప్రీ బిజినెస్ తో రికార్డులకు “శ్రీకారం” చుట్టిన శర్వానంద్..! రేపే విడుదలకు సిద్ధం..!!

bharani jella