CM KCR TamiliSai: చాలా రోజుల తరువాత ఒకే వేదికపై తెలంగాణ సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..! ఇదీ విశేషం..!!

Share

CM KCR TamiliSai: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వేదిక పంచుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ పలకరించుకున్నారు. గత కొద్ది నెలలుగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసిఆర్ మధ్య గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసిఆర్, ప్రభుత్వ అధికారుల వైఖరిపై ల గవర్నర్ తమిళిసై బాహాటంగానే విమర్శలు చేశారు. ఈ విషయంలో గవర్నర్ ను నేరుగా కేసిఆర్ విమర్శించకపోయినా పలువురు మంత్రులు గవర్నర్ వైఖరిని విమర్శించారు.

Telangana CM KCR meet Governor Tamilisai CJ swearing in ceremony

రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమాలకు సీఎం కేసిఆర్ తో సహా మంత్రులు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ కూడా నిర్వహించారు. తనను ఎవరూ ఆపలేరంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇద్దరి మధ్య గ్యాప్ తారా స్థాయికి చేరుకున్న తరుణంలో మంగళవారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎం పరస్పరం పుష్పగుచ్చాలతో గౌరవించుకోవడాన్ని అందరూ ఆశ్చర్యంగా తిలకించారు.

 

 

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ తో మంగళవారం రాజ్ భవన్ తో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ హజరైయ్యారు. సీజే ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తేనీటి విందులో తమిళిసై కేసిఆర్, ఉజ్జల్ భుయాన్ పాల్గొన్నారు. గవర్నర్, సీఎం మధ్య సమావేశం సాఫీగా సాగిందనీ, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

 

 

అయితే ఈ కార్యక్రమాల్లోని ఒక ఫోటోలో సీజే, గవర్నర్ లు ఎదురెదురుగా కాస్తంత దగ్గరగా, వారిద్దరికి మధ్యలోనే అల్లంత దూరంగా కేసిఆర్ కూర్చున్నట్లుగా ఉండటంతో, ఆ ఫోటోపై తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. “తమిళిసై, కేసిఆర్ మధ్య గ్యాప్ ఉందని తెలుసు కని మరీ ఇంత అని తెలియదు” అంటూ ఈ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు,

 


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

49 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

58 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago