NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TSPSC Group 2 Exams: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ – 2 పరీక్షల రీషెడ్యుల్ ఖరారు.. కొత్త తేదీలు ఇవే

TSPSC Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ – 2 పరీక్షల రీషెడ్యుల్ తేదీలను టీఎస్పీఎస్సీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ పరీక్షలను నవంబర్ 2,3 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 29,30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉండగా, అభ్యర్ధుల ఆందోళనలతో ప్రభుత్వం వీటిని నవంబర్ నెలకు వాయిదా వేసినట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఉదయం పది గంటల నుండి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ జరగనున్నాయి. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ WWW.tspsc.gov.in లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

TSPSC

 

తెలంగాణలో మొత్తం 783 గ్రూప్ 2 ఉద్యోగాలకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్న తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 29,30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉండగా, ఇదే నెలలో గురుకుల టీచర్ పరీక్షలు, స్టాఫ్ నర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్, ఎస్ఎస్ సీ, ఐబీపీఎస్ వంటి పలు పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్ధులు, రాజకీయ పార్టీల నేతలు ఇటీవల ఆందోళన చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి శనివారం టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శితో సమావేశమై అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి పరిస్థితులను సీఎంకు నివేదించారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు గ్రూప్ 2 పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసినట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ తాజాగా కొత్త షెడ్యుల్ ను ఖరారు చేసింది.

Telangana BJP: ఫలించని ఈటల ప్రయత్నాలు .. బీజేపీకి బైబై చెప్పిన మాజీ మంత్రి చంద్రశేఖర్

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju