వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసారు. ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై షర్మిల చేపట్టిన మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్ షర్మిల పార్టీ శ్రేణులతో కలిసి నల్ల రిబ్బన్ లు ధరించి ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమ దేవి విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ముందుగా విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల తర్వాత తాను సాయంత్రం వరకూ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని షర్మిల ఆరోపించారు.

రాష్ట్రంలో ఏటా 20 వేలకుపైగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని షర్మిల అన్నారు. కేసిఆర్ మహిళలను కేసిఆర్ ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతలే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. భరోసా యాప్ ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. అయితే దీక్షకు దిగిన వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలను అరెస్టు చేస్తున్న క్రమంలో పార్టీ శ్రేణులు అడ్డుకుని ఆందోళన చేశారు.
ఆందోళనకు గురి చేస్తున్న వరుస భూకంపాలు