33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

ఆందోళనకు గురి చేస్తున్న వరుస భూకంపాలు

Share

దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసోంలో మరో సారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో ఇవేళ వేకువజామున భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. బుధవారం వేకువజామున 359 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలికి పాటుకు గురైయ్యారు. భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. వరుస భూకంపాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Earthquake

 

అసోంలో గత నెల 14వ తేదీన భూమి కంపించింది. నాడు నాగోస్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు మరో సారి రాష్ట్రంలో భూప్రకంపనలు వచ్చాయి. అయితే ఇవేళ సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపాల వల్ల ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. టర్కీలో భూకంపం వచ్చిన తర్వాత భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. గత ఆదివారం జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ జిల్లాలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతగా నమోదు అయ్యింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లోనూ భూమి కంపించింది. అంతకు ముందు ఢిల్లీ పరిసర ప్రాంతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి.

ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ తలవంచదు అంటూ కీలక వ్యాఖ్యలు


Share

Related posts

గ్రానైట్ పరిశ్రమలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma

CM KCR: తెలంగాణ సీఎం కేసిఆర్ తో కోవివుడ్ స్టార్ హీరో విజయ్ భేటీ.. రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్లే(నా)..?  

somaraju sharma

Charan : టాప్ డైరెక్టర్ తో మరోసారి మల్టీస్టారర్ సినిమా చేస్తున్న చరణ్, చిరంజీవి..?? 

sekhar