Intinti Gruhalakshmi: లాస్య అన్నట్టుగా కేఫ్ మధ్యలోనే మూత పడిపోకుండా ఉండాలంటే.. ఈ కేఫ్ గురించి మరింత ప్రచారం ముందుకు తీసుకెళ్లాలి.. అందుకు ఉపయోగపడటానికి ఓ పాంప్లెట్ కోసం తులసి మ్యాటర్ రాయడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నోసార్లు ట్రై చేసిన తర్వాత తులసి ఒక మంచి మ్యాటర్ను రెడీ చేసి ఆ పాంప్లెట్ ను ప్రింట్ చేయించమని ప్రేమ్ తో అంటుంది.

Intinti Gruhalakshmi: నందు కోసం ఎవ్వరూ చేయని పని చేసిన తులసి.. రేపటికి సూపర్ ట్విస్ట్.!
ఆ పాంప్లెట్స్ ఐడియా చూసి నందు నందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటి నాన్న ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అని ప్రేమ్ అడుగుతాడు. ఒకప్పుడు నాకు ఎవ్వరూ లేరు అని అనుకునేవాడిని. ఇప్పుడు నాకు మీ అందరూ అండగా నిలబడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని నందు ఎమోషనల్ అవుతాడు. ప్రేమ పాంప్లెట్స్ ను ప్రింట్ చేయించి తీసుకురాగానే అందరూ ఆ పాంప్లెట్స్ ను పంచడానికి సిద్ధమవుతారు..

Krishna Mukunda Murari: ఆదర్శ్ ను తీసుకురావడానికి కృష్ణ మాస్టర్ ప్లాన్.. రేవతి పై ఫైర్ అయిన కృష్ణ..
ఇంట్లో అందరూ కలిసి తలా ఒక దిక్కు వెళ్లి ఆ పాంప్లెట్స్ పంచుతారు పాంప్లెట్స్ జనాల్లోకి వెళ్లడంతో విపరీతమైన పబ్లిసిటీ వచ్చి కేఫ్ కి జనాలు బాగా వస్తారు ఈరోజు బిజినెస్ అద్భుతంగా జరుగుతుంది. ఆఖరికి లాస్య కూడా కష్టమర్స్ కి వడ్డించడానికి ముందుకు వస్తుంది. అది చూసి తులసి ఆశ్చర్యపోయింది. మొత్తానికి నందు కేఫ్ బిజినెస్ రెండో రోజు కూడా బాగా జరుగుతుంది.

Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ ముందే మనోజ్ కిడ్నాప్.. పెళ్లి ఆపకపోతే చంపేస్తాం..!
ఇక ఆ కేఫ్ బిజినెస్ గురించి నందు తులసి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సన్నివేశాన్ని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. లాస్య వెనుక నుంచి ఆ మాటలను వింటూ ఉంటుంది. కేఫ్ ను ముందుకు తీసుకువెళ్లడానికి ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది కదా అని వాళ్లంతా అనుకుంటూ ఉంటారు .

రెడీ అయ్యి బయటకు వెళ్తుండగా ఎక్కడికి అని లాస్య అడుగుతుంది. ఈ మధ్య నువ్వు ప్రతి విషయాన్నికి ఎగ్జాక్ట్ అవుతున్నావు డాక్టర్ కి చూపించుకోమని నందు సలహా ఇస్తాడు.ఇక రేపటి ఎపిసోడ్లో నందు తను సంపాదించిన డబ్బులతో ఇంట్లో అందరికీ బట్టలు తీసుకొని వస్తాడు . వాళ్ళ అమ్మానాన్నలకి కొడుకులు కోడళ్ళకి అందరికీ ఇస్తాడు.

తులసికి కూడా ఒక చీరను తీసుకొచ్చి ఇస్తాడు. ప్లీజ్ తీసుకో అని నందు రిక్వెస్టింగా తులసితో అంటాడు. మా పాతికేళ్ల కాపురంలో ఇంతవరకు ఏనాడు నాకు ఒక్క చీర తీసుకురాలేదు.

విడిపోయిన తర్వాత చీర తీసుకువచ్చి ఇస్తున్నారు అని తులసి మనసులో అనుకుంటుంది. అప్పుడే లాస్య నందు అని కోపంగా అరుస్తుంది. ఇక ఏం జరుగుతుందో తర్వాయ భాగంలో చూద్దాం.
