Krishna Mukunda Murari: ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడానికి వస్తారు కానీ ఇంటి పెద్ద అయినా భవాని మాత్రం అక్కడికి రాదు . అలేఖ్య వెళ్లి పిలిస్తే రానని సమాధానం చెప్పిందని అనగానే.. ఏమైంది అని భవాని కలవడానికి ముకుంద వెళ్తాను అని అంటుంది.. వద్దు నేనే వెళ్లి భవాని అక్కని పిలుస్తాను అని రేవతి అంటుంది..

రేవతి భవాని దగ్గరికి వెళ్లి భోజనం చేద్దాం రా కానీ పిలుస్తుంది . ఈ ఇంట్లో నాకు చెప్పకుండానే కొన్ని నిర్ణయాలు ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారు. నా భర్త నన్ను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ కుటుంబం మొత్తాన్ని ఓకే తాటిమీద నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళమని నన్ను కోరారు.. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చేస్తుంది అదే.. కానీ మధ్యలో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇకనుంచి అలా జరగడానికి వీల్లేదు కృష్ణ తింగరి పిల్ల కావచ్చు .. తను చదువుకోవాలని కోరుకుంటుంది.

ఆ విషయంలో నువ్వు అడ్డు చెప్పడం నాకు ఏ మాత్రం నచ్చడం లేదు ఈ విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటాను అని భవాని అంటుంది. వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్లయింది కదా అక్క ఇప్పుడు వాళ్ల కాపురం గురించి ఆలోచించాలి. కానీ చదువు గురించి కాదు అని తో రేవతి చెబుతుంది ఇంట్లో పని వంట పని ఎవరైనా చేసుకుంటారు. కానీ తన ఆశయం అని చెబుతున్నా కానీ నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు అని రేవతి నీ భవాని అరుస్తుంది. ఇకనుంచి ఇంట్లో నా నిర్ణయాలు చల్లుతాయి ఇంకా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే నేను వేరుకోను ఇక నువ్వు వెళ్ళు అని భవాని రేవతిని పంపించేస్తుంది..

అలేఖ్య ముకుందా దగ్గరకు వచ్చి ఆదర్శ్ తిరిగి వచ్చాడని చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆదర్శ తిరిగి వచ్చాడని తెలిసి పరిగెత్తుకుంటూ వస్తారు. అందరూ ఆనందంగా ఉన్నా కానీ ముకుందా మనసులో మాత్రం కాస్తైనా ఆనందం కనిపించదు.. ఆదర్శ అని ఒక్కసారిగా అందరూ అతన్ని పిలవగానే తను వెనక్కి తిరిగి చూస్తాడు ఆదర్శ కాకపోవటంతో అందరి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. అప్పుడే చూస్తూ అలేఖ్య నువ్వు ఇతనేన చూసింది అని అడుగుతుంది. ఇతనే వచ్చింది ఇతనిని చూసే నేను ఆదర్శ్ ని పొరపాటు పడ్డాను అని అంటుంది.

నేను ఆదర్శ్ గురించి సమాచారం ఇవ్వడానికే ఆర్మీ తరపున ఇక్కడికి వచ్చాను అని ఆ సోల్జర్ చెబుతారు. కృష్ణ ఆర్మీ కమాండర్స్ కి రీచ్ అయ్యేలాగా ఎన్నో మెసేజ్లను మెయిల్స్ ను పంపించింది. వాటి ఫలితంగానే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీకు సమాధానం చెబుతున్నాను. ఆదర్శ్ వాకీ టాకీ నుంచి ఐయామ్ సేఫ్ అనే ఒక వాయిస్ ఓవర్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే కానీ ఫ్ గా సేఫ్ గా ఉన్నాడు. ఆ సిగ్నల్స్ ని ట్రేస్ చేసి తనని సేఫ్ గా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత మాది అని ఆ ఆర్మీ సోల్జర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు .
Intinti Gruhalakshmi: నందు కోసం ఎవ్వరూ చేయని పని చేసిన తులసి.. రేపటికి సూపర్ ట్విస్ట్.!
ముకుంద ఏమీ మాట్లాడటం లేదు అని భవాని అంటుంది . ఆదర్శ్ గురించి విన్న తర్వాత ఆ ఆనందంలో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అత్తయ్య అని అంటుంది. ముకుంద ఈ విషయంలో నువ్వు కృష్ణకి థాంక్యూ చెప్పాలి అని అంటుంది. కృష్ణ తో పాటు మురారి కూడా థాంక్యూ చెప్పాలి అత్తయ్య అని ముకుంద అంటుంది. ఆదర్శ్ తిరిగి వస్తే నాకంటే ఎక్కువ మురారినే సంతోషిస్తాడు అని ముకుందా అంటుంది. మనసులో మాత్రం నా పీడ విరగడవుతుందని అనుకుంటున్నాడు అని ముకుందా అనుకుంటుంది. నా కోడలు సౌభాగ్యవ్రతం చేయడం వల్లే ఆదర్శ ఆచూకీ మనకు తెలిసింది అని రేవతి గర్వంగా చెబుతుంది. నువ్వు ఈ ఇంటి సౌభాగ్య లక్ష్మీదేవి అని కృష్ణుని ఆకాశాన్ని ఎత్తేస్తుంది రేవతి.