24.2 C
Hyderabad
December 9, 2022
NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసి గేట్ అవుట్.. అనసూయమ్మను వస్తే నాన్నతోనే రమ్మన్నా నందు.! 

Intinti Gruhalakshmi
Share

Intinti Gruhalakshmi: అనసూయమ్మ ఎటువైపు వెళ్ళిపోయింది. తులసి అనసూయమ్మను వెతుక్కుంటూ వస్తుంది. అనసూయమ్మ నీళ్లలో దూకటానికి అక్కడికి రావడం తులసి చూస్తుంది. అత్తయ్య అంటూ తులసి ఆపడానికి ప్రయత్నిస్తుంది. అనసూయమ్మ నీళ్లలో దూకేస్తుండగా తులసి వచ్చి అత్తయ్య అంటూ వెనక్కి లాగుతుంది. రండి అత్తయ్య అంటూ పక్కకు తీసుకువెళ్లి కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది.

Intinti Gruhalakshmi Serial anasuya
Intinti Gruhalakshmi Serial anasuya

రేయ్ అభి ఏం చేస్తున్నారు రా రండి బయటికి అని నందు పిలుస్తాడు. వీళ్లంతా ఎక్కడికి వెళ్లారు ఏం చేస్తున్నారో నాకు చెప్పమని అవినీ నిలదీస్తాడు. నందు ఇక వెంటనే అవి లాస్యకు మెసేజ్ పెడతాడు. వాళ్లు గబగబా ఇంటికి వస్తారు. వాళ్ళ మొహాలు చూడగానే అందుకే గుడికి వెళ్లి రానట్టుగా అనిపించింది. ఎవ్వరు మోహాల్లో సంతోషం లేదు. కనీసం గుడికి వెళ్లొచ్చినా ఆనవాళ్లు కూడా లేవు అని నందు అంటాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పండి. మా అమ్మ మా నాన్న ఎక్కడ ప్రశ్నిస్తాడు నందు.

Intinti Gruhalakshmi Serial anasuya tulasi
Intinti Gruhalakshmi Serial anasuya tulasi

అత్తయ్య మీరు మావయ్యని అనరాని మాటలు అన్నారు. ఏ భార్య ఏ భర్తని అనకూడని మాటలన్నీ అన్నారు. అంత ఎందుకు నందితో విడాకులు తీసుకున్న నేనే తనని ఏ రోజు ఇంత తప్పుగా మాట్లాడలేదు. అనసూయ ఏడుస్తూ నా తప్పును నేను ఎలా సరిదిద్దుకోవాలో చెప్పమని తులసిని అడుగుతుంది.

Intinti Gruhalakshmi Today Episode Highlights
Intinti Gruhalakshmi Today Episode Highlights

అనసూయమ్మ తులసిని తన భర్తలు మళ్లీ తిరిగి తనకు అప్పగించమని చెబుతుంది. పుట్టినరోజు ఆయన నాతోపాటు ఉంటాడని అనుకున్నాను మీ దగ్గరికి రావడంతో నాకు కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. ఆ సమయంలో నేను ఏం మాట్లాడను నాకే అర్థం కావడం లేదు. మరోవైపు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. నా సంతోషాన్ని నేనే నా చేతులారా దూరం చేసుకున్నాను అంటూ నెత్తి మీద చేతులు పెట్టుకొని కొట్టుకుంటూ ఏడుస్తుంది అనసూయమ్మ. అత్తయ్య మీరు శాంతంగా ఉండండి అని తులసి నచ్చ చెబుతుంది. ఎలాగైనా సరే నువ్వే మీ మావయ్యను ఇంటికి తీసుకురావాలి. నువ్వు మాత్రమే ఆయన్ని ఇంటికి తీసుకురాగలవు అని అనసూయమ్మ చెబుతుంది .సరే అని అంటుంది తులసి. మరోవైపు నందు కోపంతో మా నాన్న ఎక్కడ అంటూ ఇంట్లో అందరిపై విరుచుకుపడతాడు. ఇక లాస్య చేసేది ఏమి లేక జరిగింది మొత్తం నందు కి వివరించి చెబుతుంది.

intinti gruhalakshmi serial 25 November 2022 today 799 episode highlights
intinti gruhalakshmi serial 25 November 2022 today 799 episode highlights

తులసి అనసూయమ్మ ను ఓదారుస్తూ.. అత్తయ్య పదా ఇంటికి అని నడిపించుకుంటూ తీసుకుని ఇంటికి తీసుకువస్తుంది. ఇక రోడ్డు మీద నిలబడి లోపలికి వెళ్లమని చెబుతుంది. మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు. మా నాన్న మా ఇంటి దేవుడు అని నందు కేకలు వేయడం తులసి అనసూయమ్మ వింటారు. లాస్య ఎక్కడ మా నాన్న.. మా నాన్న ఈ ఇంటికి తిరిగి వచ్చే వరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను. అప్పుడే తులసి అనసూయమ్మ ను తీసుకుని ఇంటి లోపలికి వస్తుంది. నాన్న ఇంట్లోకి తిరిగి వచ్చేవరకు నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని నందు అనసూయమ్మను అంటాడు. ఆ పక్కనే ఉన్న తులసిని చూస్తూ నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు గెటవుట్ అంటాడు.


Share

Related posts

Ram Pothineni: ఒక్క పాట‌తో 10 కోట్లు.. హీరో రామ్ అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా!

kavya N

“లైగర్” ప్రమోషన్ లో స్టోరీ చెప్పేసిన పూరి జగన్నాథ్..!!

sekhar

బాల‌య్య వ‌ర్సెస్ చిరు.. మ‌ధ్యలో న‌లిగిపోతున్న మైత్రీ!?

kavya N