NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Karthika Deepam 2 Serial April 11th 2024 Episode: అదిరిపోయే స్కెచ్ వేసిన కార్తీక్… నరసింహ కంట పడ్డ దీప..!

Karthika Deepam 2 Serial April 11th 2024 Episode: శౌర్య తన తండ్రి గురించి దీపను మరోసారి ప్రశ్నిస్తుంది. సార్ కి చూడు అమ్మ, తాతయ్య, నాన్న, అమ్మమ్మ అందరూ ఉన్నారు. మరి శౌర్యకు ఎవరు ఉన్నారు? అమ్మ తప్పి ఎవరు లేరు. మనకు ఇంతమంది ఉంటే ఎంత బాగుంటుందో? పండక్కు నాన్న వస్తారా? అమ్మ అని దీపని అడుగుతుంది శౌర్య. రాడమ్మ ఈ పండగ అయిన తరువాత మనమే వెళ్తామని చెబుతుంది దీప. బట్టలు కొనుక్కోవడానికి వెళ్దామని చెప్పి డబ్బులు చూస్తే సరిపోయేలా లేవని దీప భావిస్తుంది. శౌర్యను తీసుకుని షాపింగ్ కి వెళ్తుంది. ఒక గౌను చూసి చాలా బాగుందని అనుకుంటారు. తక్కువ రేటుకు అడిగితే షాపు అతను రాదని తెగేసి చెబుతాడు. అదంతా కార్తీక్ చూస్తూ ఉంటాడు. దీప బేరం ఆడుతుంటే అతను పొగరుగా సమాధానం చెప్పి శౌర్య చేతిలో గౌను లాగేసుకుంటాడు. బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు కానీ బేరాలు ఆడతారా అని దీపపై విరుచుకుపడతాడు. దీంతో శౌర్య కోపంగా నీ డ్రెస్ తీసుకున్నావు కదా మా అమ్మని ఎందుకు తిడుతున్నావని రివర్స్ అవుతుంది.

Karthika Deepam 2 Serial April 11th 2024 Episode
Karthika Deepam 2 Serial April 11th 2024 Episode

మా అమ్మని ఏమైనా అంటే రాయితో కొడతానని బెదిరిస్తుంది. ఇక కార్తీక్.. శౌర్యని ఆపి ఏంటే పెద్ద రౌడీలా తిరగబడుతున్నావు అని అంటాడు. మా అమ్మని ఎవరైనా అంటే నిజంగానే కొడతానని అంటుంది శౌర్య. కార్తీక్ వాళ్ళని తనతో పాటు రమ్మని పిలిస్తే దీప మాత్రం రానని చెబుతుంది. నీకోసం మా అత్త పంపించిందని సుమిత్రాను అడ్డం పెట్టుకుని వాళ్ళని తీసుకుని వెళ్లేందుకు చూస్తాడు కార్తీక్. షాపింగ్ మాల్ దగ్గరలోనే ఉంది రేట్లు చాలా తక్కువ అని శౌర్యకు ఆశ కల్పిస్తాడు కార్తీక్. దారిన పోయే ఆటో అనుకుని తన కారు ఎక్కమని చెప్పి శౌర్య వాళ్లను ఒప్పిస్తాడు కార్తీక్. శౌర్య షాపింగ్ మాల్ చూసి ఆశ్చర్య పోతుంది. ఇంత పెద్ద షాప్ లో తక్కువ ఎందుకు ఉంటాయి మమ్మల్ని అవమానించాలని అనుకుంటున్నారా అని దీపా అంటుంది. కార్తీక్ మాత్రం నచ్చజెప్పి వాళ్లని తీసుకుని వెళ్తాడు. బట్టల షాపు మా ఊరు అంతా ఉందని చెప్పి వాగుతూనే ఉంటుంది శౌర్య.

కార్తీక్ ను షాప్ లో ఒక చోట ఆపి మీరు ఇక్కడే ఉండండి. మా రేంజ్ లో గౌన్లు మేము తీసుకుంటామని అంటుంది దీప. షాప్ లో ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని డిస్కౌంట్ ఉందని చెప్పమని చెబుతాడు కార్తీక్. బిల్లు తాను కడతానని కానీ ఆ విషయం దీప వాళ్లకు చెప్పవద్దని చెబుతాడు. కార్తీక్ చెప్పినట్లుగానే అతడు డిస్కౌంట్ ఉందని అబద్ధం చెబుతాడు. ఒక గౌను చూసి రేటు ఎక్కువగా ఉందని చెప్పి వెళ్ళిపోతుంటే వాళ్ళని ఆపి రేటు తక్కువని చెబుతాడు. దీపని కూడా చీర తీసుకోమని చెప్పి కార్తీక్ దూరం నుంచి సైగ చేసి షాప్ అతనికి చెబుతాడు. శౌర్య తల్లిని కూడా కొనుక్కోమని బలవంతం పెడుతుంది. కార్తీక్ తెలివిగా దీప వాళ్లకు నచ్చిన బట్టలు తీసుకుంటాడు. ఇది నీ మీద జాలితో చేయడం లేదు. మీరు కొంతైనా సంతోషం గా ఉంటారని చేస్తున్నాను.

Karthika Deepam 2 Serial April 11th 2024 Episode
Karthika Deepam 2 Serial April 11th 2024 Episode

నువ్వు క్షమించలేదని బాధ కంటే నీ పరిస్థితి చూసి ఏమి చేయలేకపోతున్నానని బాధే ఎక్కువగా ఉంది అని అనుకుంటాడు కార్తీక్. ఇక కార్తీక్ ని శౌర్య సార్ అని పిలుస్తుంటే వద్దని అంటాడు. పేరు పెట్టి పిలవమని చెబుతాడు. పెద్దవాళ్ళను పేరు పెట్టి పిలవకూడదని మా అమ్మ చెప్పిందని అంటుంది శౌర్య. పెద్దవాళ్లను పిలవకూడదు కానీ ఫ్రెండ్స్ ని పిలవచ్చు అంటాడు కార్తీక్. అయితే కార్తీక్ అని పిలుస్తానని అంటుంది శౌర్య. మరి నన్ను శౌర్యాన్ని పిలుస్తారా అని అడుగుతుంది. ఇందాక నీ రౌడీయిజం చూసాను కదా నిన్ను నేను రౌడీ అని పిలుస్తానని అంటాడు కార్తీక్. ఇద్దరూ అలా ఫ్రెండ్స్ అయిపోతారు. దీప వాళ్లు షాపింగ్ మాల్ నుంచి బయటకు వెళ్తుంటే నరసింహ ఎదురవుతాడు. కానీ దీప చూడదు. ఇది ఊరు వెళ్ళిపోయిందని అనుకున్నాను కానీ ఇది ఇక్కడే ఉంది అసలు వీడు ఎవడు? దీప వీడితో ఎందుకు వచ్చిందని అనుమానిస్తాడు. అక్కడితో ఏప్రిల్ 11వ తారీకు ఎపిసోడ్ పూర్తయింది.

Related posts

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella