Karthikadeepam :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1468 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 29 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తోంది. అయితే గత ఎపిసోడ్లో దీప తన జీవితంలో జరిగిన సంఘటనలను డ్రామా రూపంలో వేసి కార్తీక్ కు గతం గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది.డ్రామా అంతా చూసిన కార్తీక్ ఒక్కసారిగా దీప అంటూ అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతాడు. కార్తీక్ ను దీప, డాక్టర్ ఇద్దరు కలిసి హాస్పిటల్ కు తీసుకుని. వెళ్తారు. మరోపక్క మోనిత ఏమో కార్తీక్ కనిపించడం లేదని. టెన్షన్ పడుతుంది. ఈ క్రమంలోనే నేటి. ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.
కార్తీక్ కు గతం గుర్తుకు వస్తుందా..?
కళ్లుతిరిగి పడిపోయిన కార్తీక్ ను కంగారుగా హాస్పిటల్ కి తీసుకెళతారు దీప, వాళ్ల అన్నయ్య.దీప బయటి నుంచి ట్రీట్మెంట్ ని చూస్తూ మీరు ఎలాగైనా గతం గుర్తు తెచ్చుకోవాలి డాక్టర్ బాబు.నేను ఇంక ఏ ప్రయత్నం చేయలేను అనుకుంటుంది. మరోవైపు మోనిత ఫంక్షన్ హాల్ కి వెళ్లి చూసేసరికి అక్కడెవరూ ఉండరు. అక్కడున్న వ్యక్తిని ప్రశ్నించడంతో జరిగినదంతా చెబుతాడు. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లింది అనుకుంటూ తన దగ్గర పనిచేసే ఆమె ఫోన్ లాక్కుని దీపకి కాల్ చేస్తుంది.దీప హాస్పిటల్ గురించి చెప్పకుండా కాల్ కట్ చేస్తుంది. మోనిత కాల్ చేస్తున్న విషయం డాక్టర్ అన్నయ్యకు చెబుతుంది. డాక్టర్ బాబు ఎక్కడున్నారో చెప్తే వస్తానంది..నేను చెప్పలేదు..అది మామూలుది కాదు ఎక్కడున్నా తెలుసుకుని వచ్చేస్తుంది. అది వచ్చేలోగా ఆయనకు గతం గుర్తురావాలి. నా కోరిక తీరుతుందా అన్నయ్యా..ఆయనకు గతం గుర్తొచ్చే అవకాశం ఉందా అని ఆశగా అడుగుతుంది.చూద్దాం అమ్మా కార్తీక్.స్పృహలోకి వచ్చాక ఏమంటాడో చూసి చెప్పాలి అని లోపలకు వెళ్లి డాక్టర్ ని ఆరాతీస్తాడు..
గతం గుర్తుకు వస్తే కార్తీక్ ప్రాణాలకే ప్రమాదం:
ఇక డాక్టర్ మాత్రం కార్తీక్ బ్రెయిన్ పై ప్రెజర్ పడి ఇలా అయింది..ఈసారికి గండం నుంచి బయటపడినట్టే కానీ బలవంతంగా అతనికి గతం.గుర్తు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రాణం పోయే ప్రమాదం ఉంది అని చెప్పడంతో దీప అన్నయ్య ఒక్కసారిగా షాక్. అవుతాడు.లోపలికి వచ్చిన దీప ఆయనకు గతం గుర్తొచ్చినట్టా లేనట్టా అని అడిగితే చెప్పలేం..అలా జరిగితే నిజంగా మీ అదృష్టమే.కార్తీక్ కు మెలుకువ వస్తే గాని ఏమి. చెప్పలేము అంటాడు..ఇంతలో మోనిత అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు దీప హాస్పిటల్ లో ఉన్నాం కదా సైలెంట్ గా ఉండు అని చెప్పడంతో మోనిత సైలెంట్ అవుతుంది. దీప వెళ్లి కార్తీక్ ను లేపి డాక్టర్ బాబు నన్ను గుర్తు పట్టారా.. మీకు గతం గుర్తొచ్చిందా? నేను దీపని అని అంటుంది.
మోనిత జపమే చేస్తున్న కార్తీక్ :
అప్పుడు కార్తీక్ మోనిత అని అంటాడు. వెంటనే మోనిత సంతోషిస్తూ దీపను పక్కకు తోసి కార్తీక్. దగ్గరకు వెళ్లి డాక్టర్ కార్తీక్ ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడుగితే ఇప్పుడు తీసుకెళ్లి పోవచ్చు అని చెబుతాడు. అప్పుడు మోనిత కార్తీక్ నీ తీసుకెళ్తూ ఉండగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతాడు కార్తిక్. వంటలక్కకి ఒంట్లో బాగోకపోతే వచ్చాము అని చెప్పి కార్తీక్ ను తీసుకువెళ్లిపోతుంది. ఉన్న దారులన్నీ మూసిపోయాయి అంటూ దీప ఏడుస్తుంది. ఇక దీప వాళ్ళ అన్నయ్య దీపను ఓదార్చుతూ నువ్వు ఇలా ఏసిస్తే ఎలా అమ్మా ప్రయత్నాలు మానేయకూడదమ్మ. దీనివల్ల మనకు మంచే జరిగింది. నీ వంటల వల్ల, నువ్వు చేసే ప్రయత్నాలు వల్ల, కార్తీక్ కి గతం గుర్తొచ్చే అవకాశం లేదు అని తెలిసింది కదా అందుకే మళ్ళీ కొత్త మార్గంలో ప్రయత్నిద్దాం అని దీపకు సలహా ఇస్తాడు.
సీన్ లోకి దుర్గ ఎంట్రీ :
ఇక మోనిత కారులో వస్తూ దీప కార్తీక్ కి గతం గుర్తు చేస్తుందేమో అని భయపడ్డాను కానీ అలా జరగలేదు. నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా ఓ బండి వచ్చి ఢీకొడుతుంది. మోనిత కోపంతో చూసుకో అక్కర్లేదా అనేసరికి ఎదురుగా దుర్గ ఉంటాడు. వీడేంటి ఇక్కడున్నాడని భయపడి అక్కడి నుంచి కారును స్పీడ్ గా పోనిస్తుంది. మోనితని గుర్తుపట్టిన దుర్గా తన వెనకాలే ఫాలో అవుతాడు.
దీప బాధను తీర్చేదేవరు?
సీన్ కట్ చేస్తే శౌర్య ఆటో వెనకాల ఉన్న అమ్మానాన్నలు ఎక్కడున్నారు అనే అక్షరాలు చూస్తూ మోనిత మాటలు గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది.మీరు ఉన్నారని నాకు ఇంకా అనిపిస్తుంది..ఎక్కడున్నా నా దగ్గరకు రండి అని బాధపడుతుంది. అటు దీపమాత్రం ఏడుస్తూనే ఉంటుంది. డాక్టర్ అన్నయ్య, అమ్మ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!