Maa Annayya serial: ప్రముఖ సీరియల్స్ ఛానల్ గా పేరు పొందిన జీ తెలుగు మనందరికీ సుపరిచితమే. గతంలో సీరియల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ ఛానల్ ప్రస్తుతం కొద్దిగా డీలా పడింది. కానీ వీరు అందించే కంటెంట్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఏ సీరియల్ పడితే ఆ సీరియల్ ని ప్రేక్షకులకు అందించకుండా మంచి కాన్సెప్ట్ ఉన్న సీరియల్స్ ను మాత్రమే తీసుకుంటున్నారు. అలా తాజాగా ప్రసారమవుతున్నటువంటి సీరియల్ మా అన్నయ్య. ప్రసారమైన రెండు రోజులకే ప్రేక్షకుల్లోకి విపరీతంగా వెళ్లిన ఈ సీరియల్ లో నటీనటులపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ సీరియల్ లో అన్నయ్య పాత్రలో గోకుల్ హీరోగా నటిస్తున్నాడు.
ఇక ఈ సీరియల్ లో గోకుల్ కి నలుగురు చెల్లెల్లు ఉంటారు. ఈ సీరియల్లో చెల్లెలుగా నటించబోతున్న నలుగురిలో ఇద్దరు మనకి సుపరిచితమే. కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో మురారి చెల్లెలుగా నటిస్తున్న నందిని మా అన్నయ్య సీరియల్లో ఓ చెల్లి పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో వేద చెల్లి పాత్రలో పోషించిన యాక్టర్ కూడా ఈ సీరియల్ లో ఓ చెల్లిగా పోషిస్తుంది. ఇక ఈ సీరియల్లో హీరోకి జతగా నటించబోతుంది శివాని. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు శృతి. ఈమె ఓ తమిళ్ యాక్ట్రెస్. కోల్కతాలో పుట్టి పెరిగిన ఈమె నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో మొదట హిందీ సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఈమెకి తమిళ్లో నటించే అవకాశం వచ్చింది. ఇక తమిళ్లో సైతం తన నటనను నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులోకి అడుగు పెట్టేందుకు రెడీ అయింది.
ప్రస్తుతం గోకుల్ కి జతగా శివాని నటించబోతుంది. మా అన్నయ్య సీరియల్ కనుక ఈమెకి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిస్తే రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు ఈమెకి దక్కుతాయని చెప్పుకోవచ్చు. తన చక్కని రూపం మరియు అందచందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ రియల్ లైఫ్ లో చాలా ముదురు అయినట్లు తెలుస్తుంది. తన లైఫ్ని ఏ విధంగా తీసుకెళ్లాలో మరియు ఎవరిని పెళ్లి చేసుకోవాలో అనే దానిపై చాలా అంచనాలతో ఉందట.
ఎప్పుడూ ఏది పడితే అది చేయకుండా సరైన దారిని మాత్రమే ఎంచుకుంటుందట ఈ ముద్దుగుమ్మ. అలా రియల్ లైఫ్ లో చాలా తెలివితేటలతో ముందుకు సాగుతుంది. మరి ఈమె తెలివితేటలను ఉపయోగించి సీరియల్స్ లో ఎంత మేరా పాపులారిటీ సంపాదించుకుంటుందో చూడాలి. ఇక ఏది ఎలా ఉన్నా ప్రస్తుతం అయితే ఈమె అందచందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తన అందాలను మరింత ఆరబోస్తూ ప్రేక్షకుల్లోకి బాగా వెళితే రానున్న రోజుల్లో ఈమె సినిమాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. మరి ఎంతో తెలివైన ఈ ముద్దుగుమ్మ ఈ విషయాన్ని అర్థం చేసుకుని తన కెరీర్ ను ఏ విధంగా మల్చుకుంటుందో చూడాలి..!