బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 552 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 10 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. మహేంద్ర, జగతీలు వసు రెస్టారెంట్‌కి వెళ్తారు. ఎలా ఒప్పించావ్ రిషీని మా పెళ్లి రోజుకి అని వసును అడుగుతారు. దాంతో వసుధార ఇది నా గొప్పతనం కాదు సార్ ఈ ఐడియా నాది కాదు అంటుంది. ‘మరి గౌతమ్ చెప్పాడా? ధరణీ చెప్పిందా? అంటే దేవయాని మేడమ్ చెప్పింది’ అంటుంది చాలా కూల్‌గా వసు. ఆ మాటకు మహేంద్ర గుండె పట్టుకుంటాడు. జగతీ బిత్తరపోతుంది. దేవుడా? ఇదంతా వదినగారి పనా అని ఆలోచనలో పడుతుంది.మహేంద్రా అక్కయ్య.. సాక్షీ నిశ్చితార్థం తర్వాత.. సైలెంట్‌గా ఉందేంటా అనుకున్నాను ఇదేదో తేడా అనిపిస్తోంది నాకు’ అంటుంది జగతీ. మహేంద్ర మాత్రం ఏదైన మంచే జరిగింది జగతీ అంటాడు.
దేవయాని ప్లాన్ ఏంటి అసలు..??
ఇంతలో వసు ఒక్కసారిగా కళ్లు మూసుకుని ఏదో వింటుంది. ‘ఏమైంది వసు కళ్లు మూసుకున్నావ్?’ అంటే.. ‘రిషీ సార్ వస్తున్నట్లుగా అనిపించింది మేడమ్ అంటుంది. ‘కార్ హారన్ విన్నావా?’ అంటుంది జగతీ. ‘లేదు కానీ కొన్ని సార్లు అలా అనిపిస్తుంది’ అంటుంది వసు.దాన్ని ప్రేమ అంటారులే జగతీ మనం బయలుదేరదాం అంటాడు మహేంద్ర.వసుధారా వస్తావా? రేపేగా ఫంక్షన్ ఇంటికి వెళ్దాం?’ అని మహేంద్ర అంటాడు. ‘లేదు సార్ డ్యూటీ టైమ్ కాలేదు ఇప్పుడు పర్మీషన్ అడిగితే బాగుండదు అంటుంది వసు. ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు.
వసు కోసం రెస్టారెంట్ కు వచ్చిన రిషి :
రిషీని చూసి మహేంద్ర, జగతీ షాక్ అయ్యి వసుధార ముందే భలే చెప్పిందే అనుకుంటారు. ఇక రిషీ రావడమే సరే మేము వెళ్తాము అంటూ రిషీ, వసులకి బై చెప్పి వెళ్తారు.వెంటనే రిషి కూర్చుని ‘వసుధార మనం వెళ్దాం పదా’ అంటాడు. సార్ డ్యూటీలో ఉన్నాను ఇప్పుడు కష్టం’ అంటే నువ్వు వస్తావా? లేక నేను మీ సార్‌ని పర్మీషన్ అడగాలా?అని నేను కాఫీ తాగేలోపు నువ్వు రావడానికి సిద్ధంగా ఉండు’ అంటాడు. దాంతో సరేనంటుంది వసు.
వసును ఇంటికి తీసుకుని వచ్చిన రిషి:
ఇక రిషి వసుని ఇంటికి తీసుకుని వస్తాడు. రిషి కారులోంచి దిగిన వసుధారని దేవయాని చూడగానే ‘ఇక నుంచి వసుధార నేను కలిసి ప్రయాణం చెయ్యాలి అనుకుంటున్నాం’ అనే రిషీ మాటలు గుర్తు చేసుకుంటూ రగిలిపోతుంది.ఇంతలో రిషికి కాల్ రావడంతో వసుధారా నువ్వు వెళ్లు నేను వస్తాను’ అంటాడు. వసు నడుస్తూ లోపలకి నడుస్తుంటే దేవయాని దగ్గర ఉండి. లోపలికి ఆహ్వానం ఇస్తుంది. ఇంతలో రిషి వచ్చి రేపటి ఫంక్షన్లో వదినకి సాయంగా ఉంటుందని తీసుకొచ్చాను పెద్దమ్మా’ అంటాడు. ‘నేనే తీసుకుని రమ్మందాం అనుకున్నాను రిషి’ అంటూ క్షణాల్లో మాట మాచ్చేస్తుంది దేవయాని. అప్పటికే జగతీ దేవయాని మాటల్ని గమనిస్తూ.. ‘అక్యయ్యలో ఇంత మార్పు ఏంటీ.? ఏదో తేడాగా అనిపిస్తోంది అనుకుంటుంది.
వసుకు దగ్గర ఉండి భోజనం వడ్డీస్తున్న రిషి :
ఇక వసుని జగతీ లోపలికి తీసుకుని వెళ్తుంది. కాసేపటికి అంతా భోజనాలు దగ్గర కూర్చుంటే వసు, రిషీ పక్కపక్కనే కూర్చుని వసుకు అన్నీ వడ్డిస్తూ ఉంటాడు.దేవయాని మనసులో కోపంగా ఉన్నా బయటకు మాత్రం. ఏమి లేనట్టుగా నటిస్తుంది.అయితే రిషి, వసులకు ఎదురుగా కూర్చున్న మహేంద్ర, గౌతమ్‌లు వీడు ఎప్పుడైనా మనకి ఇలా వడ్డించాడా?’ అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పువ్వులు గుచ్చుతూ ఉంటారు వసు, జగతీ, ధరణీలు, గౌతమ్ లు. అప్పుడే రిషి, మహేంద్ర పైనుంచి కిందకు దిగుతూ ఉంటారు.ఇక రిషి, వసు ఒకరికొకరు కొంటె చూపులు. చూసుకుంటూ ఉంటారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!