NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

లోకేష్ మంచి పాయింటే పట్టాడుగా..! అదేంటంటే..?

దేశ వ్యాపితంగా కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతున్నది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ప్రజలు విధిగా మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మొదటి నుండి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాస్కు ధరించకుంటే జరిమానా కూడా విధిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయితే ఏపి ప్రభుత్వం తాజాగా దీనిపై సెర్క్కులర్ కూడా జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాల్లోనూ ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొన్నది. అయితే రాష్ట్రంలో చాలా వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు మాస్కు లు ధరించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటీవల 108, 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాత్రమే మాస్కు ధరించారు. ఆ తరువాత నేటి వరకు జరిగిన కార్యక్రమాల్లో కానీ సమిక్షల సందర్భాల్లో గానీ సీఎం జగన్ దాదాపుగా మాస్క్ ధరించినట్లు కనబడలేదు.

సీఎం జగన్ మాస్క్ ధరించక పోవడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పు పట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. ‘వైఎస్ జగన్ గారి పాలనలో సామాన్యులకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయా? ప్రజలంతా ఖచ్చితంగా మాస్కు పెట్టుకోవాలి లేకపోతే చర్యలు తప్పవు అంటూ జిఓ తెచ్చిన వారు ఆ నిబంధన పాటించరా? యుశ్రారైకాపా నాయకులు కరోనా కి అతీతులా?’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.

 

‘సహాజీవన్ రెడ్డి గారికి నిబంధనలు వర్తించవా? మాస్కు పెట్టుకోకుండా స్వైర విహారం చేస్తున్న జగన్ రెడ్డి గారు ప్రజలకు ఎం సమాధానం చెబుతారు?’ అని లోకేష్ నిలదీశారు. అయితే నిత్యం ట్విట్టర్ వేదికగానే విమర్శలకు స్పందిస్తూ..ప్రతి విమర్శలు చేసే వైకాపా నాయకులు లోకేష్ ట్వీట్ కు స్పందించక పోవడం గమనార్హం. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. సీఆర్డీఏ బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై యనమల రామకృష్ణుడు గవర్నర్ కు సూచనలు చేయడాన్ని తప్పు పడుతూ..ట్విట్టర్ వేదికగా యనమలను విమర్శించారు కానీ లోకేష్ ట్విట్ కు స్పందించలేదు. దీనిపై సీఎం జగన్ ఏవిధంగా స్పందిస్తారో.. మాస్క్ ధరిస్తారో లేదో వేచి చూడాలి.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?