NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

తెలంగాణ గవర్నర్ ఎం చేయనున్నారు…??

తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు అధికం అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కూడా కరోనా కట్టడి చేయలేక చేతులు ఎత్తేసిందని విమర్శలు వస్తున్నాయి. కరోనా తొలి నాళ్లలో వారానికి ఒకటి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యల్లో విఫలం అయ్యింది అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ నాయకుడు రామ్ మాధవ్ తదితరులు కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, మరో పక్క ప్రజలు కూడా కరోనా సమస్యపై గవర్నర్ తమిళి సై ట్విట్టర్ వేదికగా పిర్యాదులు చేయడంతో ఆమె నేరుగా రంగంలోకి దిగారు. ఓ పక్క ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉండగా గవర్నర్ తమిళి సై నేరుగా రంగంలోకి దిగి సమీక్షలు నిర్వహించడం ఇప్పుడు ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ చర్యలపై కేసీఆర్ సర్కార్ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ గవర్నర్ తమిళిసై తన శైలిలో ముందుకు వెళుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన కుముద్బెన్ జోషి, తమిళనాడు లో జయలలిత హయాంలో గవర్నర్ గా పని చేసిన మర్రి చెన్నారెడ్డిల పని తీరు మాదిరిగానే నేడు తెలంగాణలో గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. వారు ఇద్దరు నిర్వహించిన మాదిరిగా తమిళిసై కూడా ప్రజా దర్బార్ నిర్వహించనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

కెసిఆర్ ముఖ్య మంత్రి అయినప్పటి నుండి సుదీర్ఘ కాలం గవర్నర్ గా పని చేసిన నర్సింహన్ తో సన్నిహిత సంబంధాలే కొనసాగగా ప్రస్తుత గవర్నర్ తమిళిసై తో పొసగడం లేదంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు ఆసక్తికరంగా, చర్చినీయాంశంగా మారుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju