Walking: భోజనం చేశాక ఓ అరగంట నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా..!?

Share

Walking: నేటి ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్ల లో అనేక రకాల మార్పులు వచ్చాయి.. ఇప్పటి రోజుల్లో భోజనం చేసిన వెంటనే మధ్యాహ్నం అయితే పనిలో నిమగ్నమవుతన్నారు.. అదే రాత్రి అయితే వెంటనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు.. మన పెద్దలు చెబుతుంటారు తిన్న వెంటనే కాసేపు నడవాలి.. హా.. ముసలి వాళ్ళు అలాగే చెబుతారులే అని పట్టించుకోము.. ఇప్పుడు ఇదే మాట ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..!! భోజనం చేసిన తర్వాత ఎంత సేపు నడవాలి..!? నడిస్తే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

 After Eating Walking: half an hour health benefits
After Eating Walking: half an hour health benefits

Walking: తిన్న తరువాత అరగంట నడిస్తే ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

భోజనం చేసిన తరువాత అసలు ఎందుకు నడవాలి అంటే.. మన తిన్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టలో చిన్న పేగులు బాగా సహకరిస్తాయి. ఆహారం లోని పోషకాలను గ్రహించడం లో చిన్న పేగులు కీలక పాత్ర పోషిస్తాయి. ఆహారం లోని పోషకాలను గ్రహించి శక్తిగా మార్చి శరీరానికి అందిస్తుంది. అయితే భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నడిస్తే తిన్న తర్వాత ఆహారం చిన్న పెగులలోకి వెళుతుంది. అది త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఇంకా గ్యాస్ట్రిక్, అసిడిటీ, అజీర్తిని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

 After Eating Walking: half an hour health benefits
After Eating Walking: half an hour health benefits

భోజనం తిన్న తరువాత శరీరంలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. అదే మనం తిన్నాక ఒక అరగంట నడిస్తే శరీరం శక్తిని ఉపయోగించుకుని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అందువలన డయాబెటీస్ ఉన్నవారు తిన్నాక ఒక అరగంట నడిస్తే డయాబెటీస్ నియంత్రణ లో ఉంచుతుంది. అందువలన ప్రతి రోజూ భోజనం చేసిన తరువాత ఒక అరగంట నడిస్తే అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.


Share

Related posts

ఓటు వేసిన సినీ ప్రముఖులు

Siva Prasad

సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 2 పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

somaraju sharma

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కనున్నది.. వరుడు మీకు సూపరిచితమే!!

Naina