Bigg Boss 6 Telugu: అరియానా ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో… మగవాళ్ళకి సైతం భారీ పోటీ ఇచ్చిన కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్ కి రాకముందు..అరియానా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీబీ అవకాశం అందుకున్న.. ఈ ముద్దుగుమ్మ… హౌస్ లో సోహెల్ వంటి యాంగ్రీ మెన్ లతో నువ్వా నేనా అన్నట్టు గేమ్ ఆడింది.
ఎలిమినేషన్ ప్రక్రియ సమయంలో ఇంకా ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సి వస్తే అరియానా… ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. దీంతో టాప్ ఫైవ్ దాకా వెళ్ళిన ఈమె.. సీజన్ ఫోర్ లో హైలెట్ గా నిలిచింది. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేస్తూ యాంకరింగ్ రంగంలో దూసుకుపోతున్న అరియానా గ్లోరి… సీజన్ ఫైవ్ లో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేసి.. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే మరోసారి అరియానా బిగ్ బాస్ ఓటిటి లో వస్తున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఈ విషయం గురించి అరియానా కొన్ని లీక్ లు కూడా సన్నిహితులకు ఇచ్చినట్లు టాక్. మేటర్ లోకి వెళితే ఇటీవల సీజన్ ఫైవ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో పాటు అంతకుముందు సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్ లతో అరియానా మీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మాజీ కంటెస్టెంట్ లు తెలుగు బిగ్ బాస్ ఓటిటి లోకి వచ్చే పరిస్థితి ఉండటంతో…అరియానా వాళ్లతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.