ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చాలా చక్కగా సాగుతోంది. మొదటి సీజన్ నుశివబాలాజీ గెలుచుకోగా, రెండవ సీజన్ లో కౌశల్ సృష్టించిన సునామి అందరికీ తెలిసిందే. మూడవ సీజన్ లో ఎంతో చాకచక్యంగా రాహుల్ సిప్లిగంజ్ గెలుపొందాడు.
ఈ మూడు సీజన్ లలోవిజేతల లక్షణాలను ఇప్పుడు సీజన్ లో అనుకరిస్తున్నారు అని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ ఎక్కువగా కోపంతో ఉండేవాడు. అందరితో కలిసిపోయి కలివిడిగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రం టాస్క్ అప్పుడు మాత్రం అతను ఎంతో పట్టుదలతో చూపించి ఆ సమయం వరకు వారిని శత్రువులుగా ట్రీట్ చేస్తారు. ఇక అదే ఇప్పుడు హౌస్ లో ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా ఒకసారి పాటిస్తున్నారు ఇలాగే అనిపిస్తుంది.
అలాగే రెండవ సీజన్ విన్నర్ కౌశల్ విషయానికి వస్తే అతనికి గేమ్ ప్లాన్ పెద్దగా లేకుండానే అనుకున్నది అనుకున్నట్టుగా చెబుతూ తను గెలుపు కోసమే వచ్చాను అంటూ చెబుతాడు. గెలుపు కోసం తాము ఏం చేసేందుకైనా సిద్ధంగా లేను అని ఇక్కడ కుటుంబ బాంధవ్యాలు పెంచుకోవడానికి తను రాలేదు అని ఖరాఖండిగా చెప్పేసాడు. ఇక ఒకరిద్దరు అతనిని పలువురు ఫాలో అవుతున్నారు. యాంగ్రీ యంగ్ మాన్ అంటూ హౌస్ లో బిల్డప్ కొడుతున్నారు.
ఇప్పటికే ఇంట్లో గత సీజన్ విన్నర్ రాహుల్ లా పులిహోర కలిపేందుకు ఇద్దరు ముగ్గురు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అయితే ప్రేక్షకులు మాత్రం ఇట్టే పసిగట్టారు. మొత్తానికి ఇలా మూడు సీజన్లలో విన్నర్ లక్షణాలను ఫార్ములాలను ఆపాదించుకోవడం వల్ల రూపాయి ఉపయోగం కూడా ఉండదని నిర్వాహకులు చెబుతున్నారట.