Breaking : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇడి అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతున్నది. తాజాగా మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా మూడు రోజుల్లో నలుగురు అరెస్ట్ అయ్యారు. ఏపీకి చెందిన వైసీపీ ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని ఈడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాన్నం రాఘవ రెడ్డి ని కోర్టు కు హాజరు పర్చనున్నారు. నిన్ననే చారియట్ మీడియాకు చెందిన రాజేష్ జోషిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

సౌత్ గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. సౌత్ గ్రూపులో రాఘవ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ లిక్కర్ స్కామ్ నిధులు ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ అధికారులు పది మందిని అరెస్టు చేశారు.
ఈ కేసులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొంత మంది రాజకీయ నాయకుల వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు అరెస్ట్ అయ్యారు. వారిలో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ రెడ్డి ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముడుపులుగా అందిన డబ్బులను గోవా ఎన్నికలకు ఆప్ పార్టీ ఉపయోగించిందని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో తమ కుటుంబానికి దానితో ఎటువంటి సంభంధం లేదని ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు. తాజా ఆయన కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మార్చి 10కి వాయిదా.. నిందితులు చంచల్‌గూడ జైలుకి తరలింపు