సాధారణంగా మనం ప్రేమించుకున్న వారు వివాహం కోసం కోర్టుకు ఎక్కడం,మేనరికం తో పెళ్లి చేసుకోవాలనుకునే వారు వివిధ కారణాల వల్ల కోర్టును ఆశ్రయించడం చూసే ఉంటాం. కానీ ఏకంగా తన చెల్లెలిని పెళ్లి చేసుకోవడం కోసం అన్న హైకోర్టును ఆశ్రయించడం ఎప్పుడైనా చూశారా? అవును ఇది నిజమే సొంత తన పెద్ద నాన్న కూతురుని పెళ్లి చేసుకోవడం కోసం అన్న ఏకంగా హైకోర్టును ఆశ్రయించిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇద్దరు సొంత అన్నదమ్ములు పిల్లలే, కానీ వారిద్దరికీ పెళ్లి జరగాలని 21 సంవత్సరాల తన అన్న ఏకంగా పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇందుకు స్పందించిన కోర్టు పిటిషన్లో దాఖలైన అమ్మాయి వయసు కేవలం 17 సంవత్సరాలే కాబట్టి, ఒక వేళ 18 ఏళ్లు దాటిన ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం చట్టబద్దం కాదని పిటిషన్లో వాదన విన్న జడ్జి గురువారం తీర్పు వెల్లడించారు.
అమ్మాయి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే ఆ వ్యక్తికి హైకోర్టుకు వెళ్లి సెక్షన్ 363 కిడ్నాపింగ్, 366A కింద నమోదైన కేసుల పై తనకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలని ఆశ్రయించాడు. అయితే స్టేట్ కౌన్సిల్ అతని బెయిల్ ను తిరస్కరించింది.
చట్టానికి విరుద్ధంగా వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ చెల్లదు అని కొట్టిపారేసింది. ఆ వ్యక్తిపై యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేసిన స్టేట్ కౌన్సిల్ బాలిక ప్రస్తుతం మైనర్ కావడంతో, ఆమె తల్లిదండ్రులు ఆ వ్యక్తిపై కేసు ఫైల్ చేశారు. ఒకవేళ బాలిక 18 సంవత్సరాలు నిండిన తరువాత కూడా అతని తో వివాహం చట్టబద్దం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే ఈ కేసును వచ్చే ఏడాది జనవరి నాటికి వాయిదా వేసినట్లు న్యాయస్థానం తెలిపింది.