చాలామంది ఎంతో ఇష్టంగా స్వీట్స్ తినడానికి పడుతుంటారు. అయితే ప్రతిరోజు స్వీట్స్ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి హానికరమే. అంతేకాకుండా మధుమేహంతో బాధపడేవారికి స్వీట్స్ తినాలని అనిపించిన కూడా వారు స్వీట్స్ తినలేరు. అలాంటి వారి కోసమే ఈ ప్రత్యేకమైన ఆల్టర్నేట్ హెల్ది రెసిపీ. ఈ రెసిపీ తినడం వల్ల షుగర్ క్రేవింగ్ తగ్గించడమే కాకుండా, ఎంతో ఆరోగ్యం కూడా ఉంటారు.
మనకు స్వీట్స్ తినాలనిపించినప్పుడల్లా మన ఇంట్లో సహజంగా దొరికే పెరుగును తినొచ్చు. ఇందులో న్యాచురల్ గా దొరికే ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి కాబట్టి సహజంగానే యోగర్ట్ కి తియ్యదనం వస్తుంది. దీనిని తినడం వల్ల స్వీట్స్ తిన్నంత ఆ అనుభూతిని పొందుతారు. అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా ఇందులో ఉన్న ప్రోబయోటిక్స్ వల్ల గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
పాలను బాగా కాచి తోడు పెట్టడం వల్ల పెరుగు, దానిద్వారా యోగర్ట్ తయారవుతుంది. పాలు పెరుగుగా మారినప్పుడే అందులో ఉన్న ప్రోబయోటిక్స్ మన శరీరానికి అందుతాయి. గోరువెచ్చని పాలలో కి కొద్దిగా పెరుగును వేసి ఐదు గంటల పాటు చీకటి ప్రదేశంలో ఉంచితే పెరుగు గా మారుతుంది. ఇందులో ఉన్న యోగర్ట్ ను ప్రతి రోజూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్, క్యాల్షియం మన శరీర పెరుగుదలకు,అలాగే మన ఎముకలకు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి.
ప్రతిరోజు పెరుగును తీసుకోవడంతో పాటు మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనికితోడు మన చర్మం కాంతివంతంగా మెరవాలి అంటే సహజ సిద్ధంగా పెరుగు నుంచి లభించే యోగర్ట్ ను తీసుకోవడం వల్ల అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ జననేంద్రియ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి కలిగిస్తుంది. ఒక్క ఆహారం లోకి మాత్రమే కాకుండా యోగర్ట్ నీ తాజా ఫ్రూట్ సలాడ్ లో కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరానికి తగినంత పోషక విలువలు అందుతాయి.