Jati Ratnalu : ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా తో కడుపుబ్బ నటించడంతో పాటు మంచి క్రైమ్ థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి..!! దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జాతిరత్నాలు అనే మరో ఫన్ రైడర్ తో వచ్చారు..! నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు..!! ఈ రోజే ఈ సినిమా విడుదలైంది..! ఇంతకీ జాతి రత్నాలు సినిమా హిట్టా ఫట్టా..? మరి ఈ సినిమా గురించి పబ్లిక్ టాక్ ఏంటి..? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..!!
జాతి రత్నాలు సినిమా హిట్టా ఫట్టా..?
మెదక్ జిల్లా జోగిపేట శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి), రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి) అల్లరి చిల్లరగా బాధ్యత లేకుండా తిరిగే కుర్రాళ్ళు వీళ్లు.. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియం షాపులో అయిష్టంగానే పనిచేసే శ్రీకాంత్.. ఉద్యోగం కోసం తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ కి వస్తాడు.. ఆ తర్వాత చిట్టి ఫరియా తో ప్రేమలో పడతాడు.. ఆ తర్వాత ముగ్గురు స్నేహితుల జీవితంలో చోటు చేసుకున్న మార్పులే జాతిరత్నాలు కథ..!!
కామెడీ ప్రధానంగా సాగే జాతి రత్నాలు ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వించేశారు..!! ఈ సినిమా ముఖ్యంగా యూత్ ఆకట్టుకునేలా మొదటి భాగం ఉంటుంది.. డైలాగ్స్, పాటలు అన్నీ ఫస్ట్ హాఫ్ ని నిలబెట్టేశాయని చెప్పవచ్చు..!! ఇక ఇంటర్ వెల్ తో అసలు కథ మొదలవుతుంది..! సెకండాఫ్ లో అక్కడ అక్కడా రొటీన్ సీన్స్ తో కాస్త విసిగించినా.. బ్రహ్మానందం డైలాగ్స్ , సన్నివేశాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.. మొత్తానికి సెకండాఫ్ ప్రేక్షకులను ఓ మోస్తరుగా మెప్పించింది..
పబ్లిక్ టాక్..!!
మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది..! ఫస్టాఫ్ అదుర్స్ అని.. ఫన్ రైడర్ మాదిరిగా సినిమా సాగిపోతుందని అభిమానులు అంటున్నారు.. ఫస్టాఫ్ అంతా బాగుంది అంటున్న అభిమానులు.. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మినహా మిగతాదంతా అద్భుతంగా ఉందని.. హిట్టు బొమ్మ అని క్లారిటీ ఇస్తున్నారు..!! నవీన్ పోలిశెట్టి ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడని ప్రశంసిస్తున్నారు.. ఈ సినిమాలో వన్ లైన్ పంచ్ లు అద్భుతంగా పేలాయని పబ్లిక్ టాక్..! హీరోగా నవీన్ పోలిశెట్టి తన ఖాతాలో మరో హిట్ ను వేసుకున్నాడు అని అంటున్నారు.. అడ్వాన్స్ బుకింగ్ కూడా అద్భుతంగా జరగడంతో.. ఈ సినిమా మొదటి రోజే సుమారుగా ఏడు కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా..!! మొత్తానికి జాతి రత్నాలు హిట్టు బొమ్మ..! కామెడీ అదుర్స్..!!