Jr.NTR – Prabhas: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇంట్రెస్ట్ అప్డేట్ రానే వచ్చేసింది..!! ఎన్టీఆర్ కెరియర్లో 30 వ చిత్రంగా రూపుదిద్దుకొంటున్న సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రానున్నట్లు ప్రకటించారు మేకర్స్.. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ గ్యారేజీ కి బౌండరీలు వేరే లెవెల్ లో ఉంటాయని కొరటాల శివ చేసిన ట్వీట్ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది..
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాను జూన్ 2021 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 29 ఏప్రిల్ 2022 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం కూడా 14 ఏప్రిల్ 2022 లో విడుదల కానుంది.. 2022 లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న రెండు చిత్రాలు ఇవే.. ఈ రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కు పెద్ద చాలెంజ్ విసిరినట్టే..