Namratha: ఇండస్ట్రీలో గుట్టుచప్పుడు కాకుండా సాయం అందించడంలో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఇతరులకు సాయం చేసి… తమ పేరు మారుమ్రోగేలా స్టేజీల పై గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మహేష్ విషయానికి వస్తే మంచి తనవంతు తాను మంచి చేసుకుంటూ పోతుంటాడు. ఈ రీతిగా దాదాపు రెండు వేలకు పైగా చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు చేయించడం.. కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం అంత సైలెంట్ గా జరిగిపోతూవుంటాయి. పనిగట్టుకుని చేసిన సాయం గురించి ఎవరికి చెప్పుకోరు.
ఇక ఇదే సమయంలో మహేష్ చాలా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వాటికి వచ్చే డబ్బులతో చాలా చారిటీ చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మహేష్ భార్య నమ్రత అనాధ బాలికలకు అండగా ఉండటానికి రెడీ అయింది. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చూసుకుంటున్న నమ్రత తాజాగా నంద్యాలలో బోర్డ్స్ ఎన్జీవో నుండి స్వతంత్ర ఒంటరి తల్లులు చేతిలో తయారుచేయబడిన న్యాప్ కిన్ లను అనాధాశ్రమంలో ఉన్న బాలికలకు ఇటీవల అందించడం జరిగింది.
నెలసరి సమయంలో అనాధ బాలికలు మహిళలు అనేక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని… తన వంతుగా వాళ్లకి నమ్రత ఈ రూపంలో.. న్యాప్ కిన్ లను అందించే.. బాధ్యత తీసుకోవడం జరిగింది. ఒక మహిళ పడే బాధ దృష్టిలో పెట్టుకుని అనాధ బాలికల విషయంలో నమ్రత తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…