NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Paoriasis: చర్మ సమస్యలు, సోరియాసిస్ కు సులువైన ఆయుర్వేద చిట్కా..

Paoriasis: చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధులలో సోరియాసిస్ ఒకటి.. రోగనరోధకశక్తి లో మార్పులు కారణంగా ఇది వ్యాపిస్తుంది.. సోరియాసిస్ సోకితే చర్మం మందంగా అవటం, వాపు, దురద, నొప్పి, చేప పొట్టు లాంటి పొలుసులు ఊడటం జరుగుతుంది. సీజన్స్ మారినపుడు ఈ వ్యాధి పెరగటం లేదా తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కృంగిపోతుంటారు.. ఇది చర్మం మాత్రమే కాకుండా గోళ్ళు, తల వంటి ఇతర శరీర భాగాలు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం లేకపోలేదు..

వాతావరణం లో తేమ తగ్గిపోయినప్పుడు కానీ, ఇన్ఫెక్షన్స్ వచ్చినపుడు దురద ఎక్కువగా వస్తుంది. వంశపారంపర్యంగా కూడా సోరియాసిస్ వస్తుంది. జీర్ణ వ్యవస్థలో లోపాల వలన కూడా సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.. అయితే రసాయన మందులు ఎన్ని వాడినా శాశ్వత పరిష్కారం దొరకడం లేదు.. అయితే సోరియాసిస్ కు ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. ఇవి పాటిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పవచ్చు..!! సోరియాసిస్ కు చూర్ణం, లేపనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!!

Paoriasis: Skin Problem To Check Perminantly Ayurvedic Medicine
Paoriasis Skin Problem To Check Perminantly Ayurvedic Medicine

Paoriasis: సోరియాసిస్ కు చెక్ పెట్టే ఆయుర్వేద అద్భుత చిట్కా..!!

కావలసిన పదార్థాలు :

తాటి బెల్లం – 560 గ్రాములు, బవంచది పొడి – 50 గ్రాములు, సుగంధి పాల పొడి – 50 గ్రాములు, నేల ఉసిరి పొడి – 50 గ్రాములు, తెల్ల గుగ్గిళ్లమాకు పొడి – 50 గ్రాములు, మంజిస్తాడి పొడి – 50 గ్రాములు, సంద్రచెక్కల పొడి – 50 గ్రాములు, గంధక భస్మం – 5 గ్రాములు, వ్యధిహరణ్రస్ – 50 గ్రాములు.

ఈ పదార్థాలన్నింటిని సేకరించి శుభ్రపరుచుకోవాలి వీటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పైన తెలిపిన మోతాదులో ఈ పొడిలన్నింటిని కలుపుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పొడిని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి అరగంట ముందు ఒక స్పూన్ పొడి ని గ్లాస్ నీటిలో వేసుకుని తాగాలి. ఇలా చేయడం వలన సోరియాసిస్ తగ్గుతుంది. అలాగే మీ శరీరంపై ఉన్న అలర్జీ వారం రోజుల్లోనే తగ్గుతోంది. ఈ పొడిని సమస్య తీవ్రతను బట్టి ఒక నెల లేదా రెండు నెలలు వాడాలి. ఈ చూర్ణాన్ని వాడిన ఏడవ రోజు నుంచి దురద తగ్గడం మొదలవుతుంది. అలానే క్రింద చెప్పుకొబోయే నూనె కూడా లేపనంగా రాయాలి.

Paoriasis: Skin Problem To Check Perminantly Ayurvedic Medicine
Paoriasis Skin Problem To Check Perminantly Ayurvedic Medicine

Paoriasis: సోరియాసిస్ కు లేపనంగా రాయాల్సిన తైలం..!!

కావలసిన పదార్థాలు :

కొబ్బరినూనె – 100 మిల్లీ, వేపకుల పొడి – 10 గ్రాములు, నేల ఉసిరి ఆకుల పొడి – 10 గ్రాములు.

వేప ఆకులు, నేల ఉసిరి ఆకులు తీసుకొచ్చి శుభ్రం చేసుకోవాలి. ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ రెండు పొడులను ఒక గిన్నెలో పోసి అందులో కొబ్బరినూనె కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న తైలమును దురద, నవ్వలు ఉన్న చోట రాసుకుని ఒక నిమిషం పాటు మసాజ్ చేయాలి. ఇలా రాసుకుంటే త్వరగా దురద, సోరియాసిస్ తగ్గుతుంది. పైన చెప్పిన పొడి, తైలం రాసుకుంటునే పత్యం పాటించాలి. చికెన్, చేపలు, పచ్చి కొబ్బరి, పచ్చి మిరపకాయలు, అలసందలు, అరటి పండు, వంకాయ, గోంగూర వంటివి తినకూడదు. అలాగే మీకు ఏమైనా తింటే దురద వస్తుంది అనుకుంటే అలాంటి వస్తువులు ఏమి తినకూడదు. ఈ రెండు చిట్కాలు పాటిస్తే అంతే సొరియాసిస్ కు పరిష్కారం చెప్పవచ్చు.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju