NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

#RAPO19: రామ్ ను ఢీకొట్టే పాత్రలో ఆది..!!

Share

#RAPO19: రామ్ పోతినేని హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.. RAPO19 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. ఈ చిత్రంలో రామ్ ని ఢీకొట్టే విలన్ పాత్రలో ఎవరు నటించనున్నారో అధికారికంగా ప్రకటించారు మేకర్స్..

#RAPO19: movie Vilan role on ADI Pinisetti
RAPO19 movie Vilan role on ADI Pinisetti

 

ఇటీవల ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించబోతున్నటు సోషల్ మీడియా కోడైకూస్తోంది.. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ దర్శకుడు లింగుస్వామి ఆది పినిశెట్టి ని తమ చిత్ర టీం లోకి ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన చేస్తూ పోస్టర్ను విడుదల చేశారు.. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఆది పినిశెట్టి కూడా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో విలన్ రోల్ కోసం లింగుస్వామి పవర్ఫుల్ స్టోరీని రాసుకున్నట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఘర్షణ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Share

Related posts

Whatsapp: 2022లో రాబోతున్న వాట్సాప్ ఫీచర్లతో యూజర్లు పండగ చేసుకోండి!

Ram

పూరి జగన్నాధ్ పరిచయం చేస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ లో మంటలు పెడతారట..!

GRK

సీఎంఆర్ఎఫ్ కుంభకోణంలో..! కీలక పెద్దలు..! సీఎం సీరియస్

somaraju sharma