హౌసింగ్ లోన్ కోసం చూస్తున్నారా.. కారు కొనడానికి పూర్తి ఫైనాన్స్ కావాలా… పర్సనల్ లోన్ కావాలా.. అయితే మీకు స్టేట్ బ్యాంకు నుండి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంకు పండుగ పురస్కరించుకొని కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు సిద్దం చేసింది. భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా.
రానున్న పండుగల నేపధ్యంలో కస్టమర్లకు ప్రత్యేక రాయితీలతో కూడిన ఆఫర్లు ప్రకటించింది. స్టేట్ బ్యాంకులో ప్రొసెసింగ్ ఫీజు లేకుండా రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ బెనిఫిట్ కారు, గోల్డ్ , పర్సనల్ లోన్ లకు లభిస్తుంది. కారు లోన్ కు పూర్తి శాతం ఫైనాన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు వారు ఎంపిక చేసిన మోడల్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది సుమా.. అలాగే ఎస్ బీ ఐ వారిచే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లో ఇల్లు కాని, ఫ్లాట్ కాని కొనుగొలు దారులకు లోన్ ప్రొసెసంగ్ ఫీజు లేదు. క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి వడ్డీ రేటులో పది బేసిస్ పాయింట్లు వరకు తగ్గిస్తుంది. యోనో యాప్ ఉపయోగించి హోమ్ లోన్ తీసుకుంటే మరో ఐదు బేసిస్ పాయింట్లు రాయితీ వస్తుంది. ఈ లోన్లకు వడ్డీ రేటు 7.5 శాతం నుండి మొదలవుతుంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసుకునే వారికి ఈ ప్రొసెసింగ్ ఫీజులో రాయితీ బెనిఫిట్ అందుతుందని అధికారులు తెలుపుతున్నారు. ఇంకా తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. పర్సనల్ లోన్లు కూడా తక్కవ వడ్డీకే అందజేస్తున్నామన్నారు. పర్సనల్ లోన్ తీసుకునే వరికి వడ్డీ రేటు 9.6 శాతం నుండి ఉంటుంది.