Credit Card: ఈ క్రెడిట్ కార్డు వాడేవారికి శుభవార్త.. అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా 12,500 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే ఇది అన్ని క్రెడిట్ కార్డులకు వర్తించదు. అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు పై ఈ ఆఫర్ ఉంది.ఈ క్రెడిట్ కార్డు కలిగిన వారు ఏకంగా భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్ల పై ఏకంగా 12,500 వరకు తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. మీరు ఎంచుకునే బ్రాండ్ ప్రొడక్ట్ల ఆధారంగా మీకు వచ్చే డిస్కౌంట్ కూడా మారుతుంది.

లెవొవొ బ్రాండ్ ప్రాజెక్టులు కొంటే మీకు 10 శాతం వరకు తగ్గింపు వస్తుంది.గరిష్టంగా 10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రాజెక్టులు కొనుగోలు చేయాలని భావిస్తే మీకు 22.5% వరకు తగ్గింపు వస్తుంది. గరిష్టంగా 12,500 వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకే అందుబాటులో ఉంటుంది. బాష్ సిమెంట్స్ ప్రోడక్ట్ లపై అయితే మీకు 12 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. గరిష్టంగా 6,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ కూడా మార్చి 31 వరకు అందుబాటులో ఉంది.
అలాగే రిలయన్స్ రిటైల్ లో 20% వరకు తగ్గింపు ఉంది. గరిష్టంగా ₹7,500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మార్చి 31 వరకే ఉంటుంది. ఇంకా కెనాన్ ప్రోడక్ట్లపై ఆఫర్లు ఉన్నాయి. మీరు ఈ ప్రాజెక్టులపై 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
గరిష్టంగా 10,000 వరకు కూడా తగ్గింపు వర్తిస్తుంది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు ఉంటుంది. అలాగే వోల్టాస్ ప్రొడక్టుల విషయానికి వస్తే వీటిపై 17.5% తగ్గింపు వస్తుంది గరిష్టంగా 9500 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ కూడా జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లు కేవలం మీరు స్టోర్ కు వెళ్లి ప్రోడక్ట్లను కొంటేనే వర్తిస్తుంది. అది కూడా ఫైన్ ల్యాబ్స్ టెర్మినల్స్ వద్ద అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.