ఈ లోకంలో ఎంతోమధురమైనది ప్రేమ. ఇక ఆ ప్రేమను ఎంతోమంది పొందుతారు కానీ ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లిన సమయంలోనే అర్దాంతరంగా ఆగిపోతుంది. కొందరి విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్న చివరి నిమిషంలో ఆగిపోతాయి. పెళ్లి అనేది ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ విషయం కాబట్టి వాళ్లు తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను ఎక్కువగా చర్చించారు.
కానీ మన సెలబ్రిటీస్ లో కూడా చాలామంది వాళ్ల రిలేషన్ షిప్ ని పెళ్లి దాకా వచ్చి ఆగిపోయాయి. మామూలుగా సెలబ్రిటీస్ మధ్య రిలేషన్ షిప్ ఉన్నా కూడా రూమర్స్ అని కొట్టి పారేస్తారు. కానీ కొంతమంది తాము పెళ్లి చేసుకుంటున్నామని అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయినవారు ఉన్నారు. అలాంటి సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం!
తరుణ్-ఆర్తి అగర్వాల్, అక్షయ్ కుమార్ – శిల్పా శెట్టి, త్రిష – వరుణ్ మణియన్, ప్రభుదేవా – నయనతార, ఉదయ్ కిరణ్ – సుస్మిత, విశాల్ – అనీషా, అఖిల్ – శ్రేయ భూపాల్, రక్షిత్ శెట్టి – రష్మిక మందన్. వీరే కాకుండా ఎంతోమంది సెలబ్రెటీలు ప్రేమ వరకు వెళ్లి పెళ్లి సమయానికి వెనకడుగు వేసినవారు ఉన్నారు. కారణాలు ఏవైనా మధ్యలోనే పరువును కూడా లెక్క చెయ్యకుండా విడిపోయిన జంటలు ఇవి. ఇప్పటికి ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో ఈ విషయాలను బయటకు వచ్చి మాయం అవుతుంటాయ్.