సన్నీలియోన్ ఏంటి…. వైజాగ్ లో ఉండటం ఏమిటి? అని డౌట్ పడుతున్న వారందరికీ ‘టెంపర్’ సినిమా చూసి ఉంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అవును…. ప్రకాష్ రాజ్ వైజాగ్ లో కూడా సన్నీ లియోన్ లాంటి అందగత్తె ఉంది అని చెప్పిన విషయం గుర్తు ఉంది కదా. ఆమె పేరే నోరా ఫతేహి.
చాలా తక్కువ టైంలో బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ప్రముఖ నటీనటులతో కలిసి యాక్ట్ చేస్తోంది. అతి సున్నితమైన స్కిన్ టోన్…. ఎవరికైనా అసూయ కలిగే చర్మసౌందర్యం కలిగి ఉండే ఈ మెరుపు తీగ అటు నటనతో.. ఇటు అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది.
సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, రాజ్ కుమార్ రావు వంటి మేటీ స్టార్లతో కలిసి నటిస్తున్న ఈమె కెనదియన్ డాన్సర్ అని చాలా కొద్ది మందికే తెలుసు. ఎవరైతే ఏం తన అందాలతో స్టెప్పులతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం ఈమె నృత్య నైపుణ్యాల వల్ల బాలీవుడ్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేస్తే చాలని నిర్మాతలు కోరుకుంటున్నారు.
తాజాగా ఈ అందాలరాశి ఇలా ఒక సింగిల్ పీస్ డ్రెస్ తో అందరి మధ్య నిలిచింది. లేత పసుపు రంగు డ్రెస్ ధరించిన ఆమె ముఖానికి మాస్క్ పెట్టుకొని ఉన్నా కూడా తన అందంతో అందరిని మెప్పించింది. ఆమె ఇలా తిరిగితే చాలు మనందరినీ తలతిప్పుకోనివ్వకుండా చేస్తోంది.
ఆమెకు సంబంధించిన మరిన్ని శృంగారభరిత ఫోటోలను కింద చూడవచ్చు. ఇక అంతకంటే ముందు వైజాగ్ సన్నీ లియోన్ గా ఆమె టెంపర్ సినిమా లో చేసిన డాన్స్ స్టెప్పులు కి మీరు కనెక్ట్ అయిపోవడం ఖాయం.