కొందరు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతే మరికొందరు పుట్టాక అదృష్టవంతులు అవుతారు. ఇక అలానే పుట్టిన పసికందు కూడా ఒక అద్భుతమైన ఆఫర్ ని కొట్టేశాడు. అంతగా ఏం చేశాడు అని అనుకుంటున్నారా? అదేనండి.. విమానంలో పుట్టాడు. ఇండిగో విమానంలో పుట్టాడు.. అందుకే ఇండిగో వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అతని జీవితకాలంలో ఎక్కడికైనా సరే ఉచితంగా వెళ్లొచ్చు అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ నెలలు నిండిన గర్భిణీ ప్రయాణిస్తుంది. అయితే కరెక్ట్ గా విమానం ప్రారంభమైన సమయానికి ఆమెకు పండంటి బిడ్డకు విమానంలోనే జన్మనిచ్చింది. దీంతో విమానంలోని సిబ్బంది ఆమెకు సాయం అందించినట్టు వెల్లడించారు.
ఇక రాత్రి 7:30 నిమిషాలకు బెంగుళూరులో విమానం ల్యాండింగ్ అవ్వగా వెంటనే తల్లిబిడ్డలు ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ విషయాన్నీ ఇండిగోనే వెల్లడించింది. ఆస్పత్రికి చేరిన వారిద్దరిని పరీక్షించిన డాక్టర్లు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తల్లీబిడ్డల ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో అవి వైరల్ గా మారాయ్. అంతేకాదు ఆ విమానంలో జన్మించిన ఆ బాలుడికి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించే బంపర్ ఆఫర్ ని ఇచ్చారు సిబ్బంది.
This is just great news!!!
A baby was born on board Indigo flight from Delhi to Bangalore today. Understand that baby will get life long free ticket from IndiGo airlines. Kudos to entire crew?@hvgoenka @sunandavashisht @ShefVaidya @vivekagnihotri @anandmahindra pic.twitter.com/719azazBXD
— Girish™??© (@Jai_Shreeram999) October 7, 2020