NewsOrbit
Right Side Videos

చేపా చేపా క్షేమమేగా!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : పిల్లవాడికి పెద్ద చేప పడింది. ఎవరైనా ఇంటికి తీసుకువెళ్లి అమ్మకు ఇచ్చి కమ్మటి కూర వండించుకు తింటారు. కానీ ఆ బాలుడికి మనసు ఒప్పలేదు. దానిని మళ్లీ  అక్కడే వదిలిపెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చూసినవారి మనసులను కదిలించివేస్తోంది.

ఈ సంఘటన ప్లోరిడాలో సంభవించింది. కెమారీ తన తండ్రితో కలిసి చేపలవేటకు వెళ్లాడు. తండ్రికి పడలేదు కానీ కుర్రవాడికి దాదాపు మూడు కిలోల బరువున్న పండుగప్ప పడింది. దానిని కెమారీ తిరిగి నీళ్లలో వదిలిపెట్టడాన్ని ఆ తండ్రి వీడియో తీసి యుట్యూబ్‌లో పోస్టు చేశాడు. వెంటనే అది వైరల్ అయింది.

వీడియోలో కెమారీ తనకుపడిన చేపను ముందు గర్వంగా తండ్రికి చూపిస్తాడు. అంత పెద్ద చేపను పట్టిన కుమారుడి ఆనందాన్ని తండ్రి వీడియోలో బంధిస్తుండగా  కెమారీ అకస్మాత్తుగా అనూహ్యంగా ఈ బ్యూటీని తిరిగి నీటిలో వదిలిపెడదాం అంటూ చేపను నెమ్మదిగా నీటిలో వదులుతాడు. నీటిలో చేపను వెన్ను నిమిరుతూ, తిరిగివెళ్లి బాగా ఉండు అంటాడు. ఒక్క క్షణం అక్కడే ఉన్న చేప ఈదుకుంటూ వెళ్లిపోతుంది.

పిల్లవాడు ఆ చేపను వదలడం, దాని వెన్ను నిమరడం, దాని క్షేమం కోరడం..ఇవన్నీ కూడా నెటిజెన్స్  మనసు దోచుకున్నాయి. ఒకరయితే ఈ కుర్రవాడు ఎప్పటికయినా అమెరికా అధ్యక్షుడు కావాల్సిందే అని ట్వీట్ చేశారు.

author avatar
Siva Prasad

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment