చావు అంచు వరకూ..!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఎవ్వరూ చేయలేని సాహసం చేయాలనుకున్నారో ఏమో తెలీదు గానీ.. ఇద్దరు మత్య్సకారులు చావు అంచుల వరకు వెళ్లి తిగిరి వచ్చారు. 66 అడుగుల లోతు ఉన్న రంధ్రం దగ్గరకు వెళ్తే ప్రమాదం అని తెలిసినప్పటికీ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒళ్లు గగుర్పాటు పుట్టిస్తోన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని డైర్బీషైర్‌లోని లేడి బోవర్ రిజర్వాయర్‌లోకి కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు మత్స్యకారులు మాత్రం అందులో ఉన్న 66 అడుగుల ప్లగ్‌ హోల్‌కు చాలా దగ్గరగా వెళ్లారు. సాధారణంగా అక్కడికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. ఎందుకంటే ప్లగ్ హోల్స్ దగ్గర వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అది తెలిసి కూడా ఇద్దరు మత్స్యకారులు ప్లగ్ హోల్‌కు దగ్గరగా వెళ్లారు. ఆ దృశ్యాన్ని ఫ్లో నెల్సన్ అనే మహిళ వీడియో తీసింది. హోల్‌కు దగ్గరగా పోతున్న సమయంలో పడవలను మత్స్యకారులు కంట్రోల్‌గానే నడుపుతున్నప్పటికీ.. ఆ దృశ్యాలు చూడటానికే ఎంతో భయం కలిగించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ విషయం రిజర్వాయర్ అధికారులకు తెలియడంతో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘రిజర్వాయర్ ను చేపట వేట కోసం ఉపయోగించడం సంతోషంగా ఉంది. కానీ ఇంటి ప్రమాదకర పరిస్థితులు కొని తెచ్చుకోవద్ద’ అని అధికారులు కోరారు. రిజర్వాయర్ లో ఉన్న రెండు ప్రమాదకరమైన ప్లగ్‌ హోల్‌ ఉన్నాయని వాటికి ప్రజలకు దూరంగా ఉండాలని తెలిపారు.