ఈ యుగం పేరేవిటి
ఓస్ ఏమాత్రం తెలీదా కలియుగం
సారీ సర్ దీన్ని కంప్యూటర్ యుగం అంటారు
దీన్ని టెక్నాలజీ అభివృద్ధి అంటారు
నిజవే ఒప్పుకుంటాను
ఆఫీసుల్లో అవి అవసరమే
కానీ షాపుల్లోనూ ఇళ్లలోనూ ఎక్కడ చూసినా అవే
షాపులో రెండు వస్తువులు కొంటే వాడు కంప్యూటర్లోనే లెక్క వేస్తాడు
ఆ మాత్రం నోటిలెక్క చెయ్యలేడా
అంటే మనం అతి చిన్న దానికి కూడా మెదడు వాడడం మానేసేం
అసలు మన మెదడులాటి కంప్యూటర్ ఎక్కడా ఉండదు
దానికి ప్రింటర్లు సీడీలు అక్కర్లేదు
ఇప్పుడు కంప్యూటర్లు వచ్చి మన మెదడుని మొద్దు బార్చేసేయి
మెదడు కత్తిలాంటిది వాడితే పదునెక్కుతుంది
లేకపోతె తుప్పు పడుతుంది
ఇప్పుడు మనం తుప్పు స్టేజీలోనే ఉన్నాం
పైగా పిల్లల్ని కూడా ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నాం
ప్రతి పిల్లా పిల్లడు కంప్యూటర్ ముందే ఉంటున్నారు
ఒళ్ళు అలవదు మనసు అలవదు ఆటలు లేవు చదువూ లేదు పిల్లలకి
ఓ రకంగా పిల్లల్ని పరమ బద్దకస్తులుగా తయారు చేస్తున్నాం
వాళ్లలో క్రియేటివిటీ పోయింది తోటిపిల్లలతో ఆడుకోవడం లేదు
రేపు పెద్ద అయ్యేక వీళ్ళు చురుగ్గా పని చెయ్యగలరా
మనం పిల్లల్ని ధ్వంసం చేస్తున్నాం
కంటిచూపు దెబ్బతింటుంది
మెడ నొప్పి నడుము నొప్పి వస్తాయి
అన్నిటికీ మించి వాళ్ళు ఓటమి ఒప్పుకోలేరు ఫలితం ఆత్మహత్యలు
కంప్యూటర్లు ఆఫీసుల్లో అవసరం కానీ పిల్లలకి మాత్రం చెడు చేస్తున్నాయి
మెదడుకే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదికాదని డాక్టర్లు చెబుతున్నారు
ఇంతకీ అన్నీ కంప్యూటర్ చేస్తే నువ్వేం చేస్తావు
పిల్లల్ని స్వంతంగా ఆలోచించనివ్వండి
లేకపోతె ఎందుకూ పనికిరారు
వాళ్ళ భవిష్యత్తుని నాశనం చెయ్యకండి
మా పిల్లడు కంప్యూటర్ దగ్గర కూర్చుంటే అన్నం నీళ్లు అక్కర్లేదు
అని మురిసిపోకండి
రోబోలుగా తయారు చెయ్యొద్దు
పిల్లలకి చదువు కన్నా ఆటలు అవసరం
ప్రతి ఆటలోను గెలుపు ఓటమి ఉంటాయి
కంప్యూటర్లో అవి ఉండవు.
కేవలం రిమోట్ తిప్పడవే
బుర్రకి పని ఉండదు
తప్పంతా పెద్దవాళ్లది ఇప్పటికైనా మించిపోలేదు
వాళ్ళని కొంచెం గమనించండి
ఎందులోనైనా రాణించాలంటే స్వంత ప్రతిభ ఉండాలి
మనం మెషిన్లం కాదు మనుషులం
అది గ్రహిస్తే చాలు
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ